ఎస్‌ఈసీపై ఏపీ హైకోర్టు తీర్పుతో మరో కొత్త చర్చ.. అదే జరిగితే..

ABN , First Publish Date - 2020-05-30T17:00:08+05:30 IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ని కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించడంతో జిల్లాలోని కొంతమంది అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇం దుకు ప్రధాన కారణం కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

ఎస్‌ఈసీపై ఏపీ హైకోర్టు తీర్పుతో మరో కొత్త చర్చ.. అదే జరిగితే..

నాటి ఆదేశాలు.. అమలయ్యేనా?

ఎస్‌ఈసీపై హైకోర్టు తీర్పుతో కొందరు అధికారుల్లో ఆందోళన


గుంటూరు (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ని కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించడంతో జిల్లాలోని కొంతమంది అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసే సమ యంలో జిల్లాలో కొంతమంది అధికారులపై చర్యలకు ఆయన ప్రభుత్వాన్ని అప్పట్లో ఆదేశించారు. అయితే ఆదేశా లను చీఫ్‌ సెక్రెటరీ నీలం సాహ్ని అమలు చేయలేదు. మరోవైపు రమే ష్‌కుమార్‌, ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగింది. ఆయన్ని ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా తొలగించి, ఆయన స్థానంలో కనగరాజ్‌ని ప్రభుత్వం నియమించింది.


అయితే ఈ ఉత్తర్వులను హైకోర్టు కొట్టి వేసింది. దీంతో ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్‌ అమరావతి రాజధానికి వచ్చి తిరిగి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఆయన జారీ చేసిన ఆదేశాలను ప్రస్తుతం పక్కన పెట్టే పరిస్థితి ఉండదు. ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి వాటిని అమలు చేసి తీరాల్సిందే. లేదంటే గత సార్వత్రిక ఎన్నికల్లో ఇలానే ఈసీ ఆదేశాలను పక్కన పెట్టినందుకు అప్పటి సీఎస్‌ పునేఠాని ఏకంగా విధుల నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో సీఎస్‌ నీలం సాహ్ని జిల్లా అధికారులకు సంబంధించి ఎస్‌ఈసీ రమేష్‌కుమార్‌ జారీచేసిన ఆదేశాల విషయంలో ఏమి నిర్ణయం తీసుకుంటారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2020-05-30T17:00:08+05:30 IST