ఏనుగుల సంరక్షణ కోసం కర్ణాటకలో ఏం చేస్తున్నారంటే...

ABN , First Publish Date - 2021-11-14T20:18:50+05:30 IST

ఏనుగుల సంరక్షణ కోసం కర్ణాటకలోని కొడగు జిల్లా హరంగి డ్యామ్ సమీపంలో కొత్త శాటిలైట్..

ఏనుగుల సంరక్షణ కోసం కర్ణాటకలో ఏం చేస్తున్నారంటే...

మైసూరు: ఏనుగుల సంరక్షణ కోసం కర్ణాటకలోని కొడగు జిల్లా హరంగి డ్యామ్ సమీపంలో కొత్త శాటిలైట్ క్యాంప్‌ ఏర్పాటుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ప్రస్తుతం దుబరే ఎలిఫెంట్ క్యాంప్‌పై ఉన్న భారం కొంతమేరకు తగ్గుతుంది. ఈ ఎలిఫెంట్ క్యాంపులో ప్రస్తుతం పెద్ద దంతాలున్న ఏనుగులు (టస్కర్లు) 32 ఉన్నాయి. హరంగి డ్యాప్ సమీపంలో ఎలిఫెంట్ క్యాంప్‌ ఏర్పాటయితే రాష్ట్రంలో ఇది తొమ్మిదవ క్యాంప్, జిల్లాలో 3వ క్యాంప్ అవుతుంది. జిల్లాలోని మతిగోడులోనూ ఎలిఫెంట్ క్యాంప్ ఉంది.


అత్తూరు రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలోన 40 ఎకరాల ప్రాజెక్టు స్థలానికి ఇటీవల వెళ్లిన బెంగళూరు సీనియర్ అధికారులు  ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేసినట్టయితే 15 ఏనుగులను తరలించే అవకాశం ఉంటుందనే నిర్ణయానికి వచ్చారు. దీనిపై కుషాలనగర్ రేంజ్ ఫారెస్ట్ అధికారి అనన్యకుమార్ మాట్లాడుతూ, ప్రతిపాదిత ప్రాజెక్టు కొత్త ఎలిఫెంట్ క్యాంప్‌‌ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందన్నారు. నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదని, మౌలిక వసతుల కల్పన కనీసం ఆరు నెలలు పడుతుందని చెప్పారు. ఫేజ్-1 పనలు పూర్తయిన తర్వాతనే ఏనుగులను తరలించే అవకాశం ఉంటుదని చెప్పారు.


కర్ణాటక హైకోర్టు ఏర్పాటు చేసిన నిపుణఉల కమిటీ ఇటీవల దుబరే క్యాంప్‌ ప్రాంతాన్ని సందర్శించింది. క్యాంపులో 15 ఏనుగులను మాత్రమే ఉంచాలని కమిటీ సూచించింది. ఈ నేపథ్యంలో కొత్త క్యాంపు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారుల సమాచారం ప్రకారం, క్యాంపు ఏర్పాటు మొదటి దశ పనులకు 70 లక్షలు వరకూ ఖర్చవుతుంది. కంపెన్సేటరీ అఫోరిస్టేషన్ ఫండ్ మేనేజిమెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ నుంచి నిధులను ఇందుకోసం ఖర్చు చేస్తారు. మావటిలు, కవాడీల ఇళ్లు, మెడికల్ డిస్పెన్సరీ, ఇతర కనీస మౌలిక వసతుల కల్పన ఫస్ట్ ఫేజ్‌లో చేపడతారు.

Updated Date - 2021-11-14T20:18:50+05:30 IST