కొత్త దోపిడీ

ABN , First Publish Date - 2020-09-17T10:56:25+05:30 IST

రోడ్లు, భవనాల శాఖ(ఆర్‌అండ్‌బీ) పనుల్లో కొంగొత్త దోపిడీ మొదలైంది. రూ.వందల కోట్ల పనులను ఒక ప్యాకేజీ కింద తీసుకొచ్చి సొమ్ము చేసుకునే యత్నానికి తెర తీశారు. రాష్ట్రస్థాయి అధికా

కొత్త దోపిడీ

ఎన్‌డీబీ టెండర్లలో రెండే బిడ్లు

జిల్లాలో  రూ. 122 కోట్లతో ఒకే ప్యాకేజీ 

రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పిన నేతలు 

ఆర్‌అండ్‌బీలో రాజకీయం

నూతన నిబంధనలే మార్గం


అనంతపురం కార్పొరేషన్‌, సెప్టెంబరు 16 :

 రోడ్లు, భవనాల శాఖ(ఆర్‌అండ్‌బీ) పనుల్లో కొంగొత్త దోపిడీ మొదలైంది. రూ.వందల కోట్ల పనులను ఒక ప్యాకేజీ కింద తీసుకొచ్చి సొమ్ము చేసుకునే యత్నానికి తెర తీశారు. రాష్ట్రస్థాయి అధికార పార్టీ నేతలు ఇందులో కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఎవరూ వీటిలోకి రాకుండా తమ వారికే కాంట్రాక్ట్‌ దక్కించుకోవడానికి పక్కా ప్రణాళిక రచించారు. జిల్లాలో రూ. 122 కోట్ల ఆర్‌అండ్‌బీ పనులకు రెండు సంస్థలే బిడ్లు వేశాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ఎన్‌డీబీ(న్యూ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌) రుణంతో చేపడుతున్న పనుల్లో కొత్త నిబంధనలతో పాటు, తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచారం.


పనులు ఒకరికే దక్కడం వల్ల భారీగా సొమ్ము చేసుకునే అవకాశముంది. ఈ క్రమంలో రెండు బిడ్లు మాత్రమే దాఖలు కాగా జిల్లాకు సంబంధించి ఒక టెండర్‌ మాత్రమే వేశారు. ఈ టెండర్ల వ్యవహారంలో నిబంధనలు చూసి అటు కాంట్రాక్టర్లు, ఇటు అధికారులు ముక్కున వేలేసు కుంటున్నారు. 


ఇవేం నిబంధనలో...

జిల్లాలో ఎన్‌డీబీ కింద రూ. 122 కోట్లతో ఒకే ప్యాకేజీ కింద పనులు చేపట్టనున్నారు. ఇందులో రాష్ట్ర రహదా రులు, మేజర్‌ డిస్ర్టిక్ట్‌ రోడ్ల(ఎండీఆర్‌) పరిధిలో అన్నీ బ్లాక్‌ టాప్‌(బీటీ) రోడ్లే. గత నెలలో ఆన్‌లైన్‌లో టెండర్లు పిలిచా రు. గతంలో పనులకు విడివిడిగా టెండర్లు పిలిచేవారు. కానీ ఇప్పుడు ఒకే ప్యాకేజీ కావడంతో కొందరు కాంట్రా క్టర్లు మిన్నకుండిపోవాల్సి వచ్చింది. క్లాస్‌-5 కాంట్రాక్టర్‌ (రూ. 10 లక్షలు), క్లాస్‌-4 కాంట్రాక్టర్‌(రూ. 50 లక్షలు), క్లాస్‌-3 కాంట్రాక్టర్‌(రూ. కోటి), క్లాస్‌-2 కాంట్రాక్టర్‌(రూ. 50 కోట్లు), క్లాస్‌-1 కాంట్రాక్టర్‌(రూ. 100 కోట్లు) వరకూ పనిచేయడానికి అర్హులు.


ఇక స్పెషల్‌ క్లాస్‌ కాంట్రాక్టర్‌ ఎన్ని వందల కోట్ల పనులైనా చేయడానికి అర్హుడు. వర్క్‌ దక్కించుకోవాలంటే కాంట్రాక్టర్‌ గత ఐదేళ్లలో ప్రస్తుతము న్న పనిలో రూ. 122 కోట్లలో 80 శాతం అంటే దాదాపు రూ.97 కోట్లపైబడి పనిచేసి ఉండాలనే నిబంధన ఉంచినట్లు సమాచారం. వాస్తవానికి 50 శాతమే పూర్తయి ఉండాలనే నిబంధన ఉంచాలని కాంట్రాక్ట్‌ వర్గాలు పేర్కొం టున్నాయి. మరో నిబంధనలో కాంట్రాక్టర్‌కు లేదా ఆఫర్స్‌ పేరుతో 4 లేదా 5 బిటీ ప్లాట్స్‌ ఉండాలని విధించినట్టు తెలిసింది. 


అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే...

ఎన్‌డీబీ పనులు తమ అనుయాయులకే దక్కించుకు నేందుకు అధికార పార్టీ నేతలు టెండర్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ టెండర్లకు జిల్లాకు చెందిన కేజీవీఆర్‌ జాయింట్‌ వెంచర్‌ పేరుతో, హైదరాబాదుకు చెందిన వృద్ధి ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక్షన్‌ సంస్థలు బిడ్లు వేశాయి. ఒక ఫర్మ్‌ పేరుతో టెండర్‌ వేసే సమయంలో ఇద్దరి నుం చి ఐదుగురి వరకూ కాంట్రాక్టర్లు కలుస్తారు.


జాయింట్‌ వెంచర్‌గా టెండర్‌ దాఖలు చేస్తారు. ఈ లెక్కన క్లాస్‌-1 కాంట్రాక్టర్లు, స్పెషల్‌క్లాస్‌ కాంట్రాక్టర్లు అర్హులైతే జిల్లాలో ఆ సంఖ్య ఎక్కువగానే ఉంది. క్లాస్‌-1 కాంట్రాక్టర్లు 30 మంది వరకూ, స్పెషల్‌ క్లాస్‌ కాంట్రాక్టర్లు 12 మంది వ రకూ ఉన్నారు. జిల్లా పనులు దక్కించుకోవడానికి కేజీవీ ఆర్‌ సంస్థలో ఎవరైనా కాంట్రాక్టర్‌ కీలకంగా వ్యవహరిం చారా...? లేక అధికార పార్టీ నేత సూచనల మేరకు టెండ ర్‌ దాఖలైందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 


 వృద్ధి ఇన్‌ఫ్రా సంస్థ జిల్లాతో పాటు కృష్ణా జిల్లా పనుల్లో నూ టెండర్‌ వేయడం గమనార్హం. చాలా జిల్లాల్లో రెండే టెండర్లు దాఖలు కావడంపై ఉద్దేశపూర్వక చర్చలున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు టెండర్‌ వేసిన ఆ రెండు సంస్థల్లో ఎవరు తక్కువకు కోట్‌ చేస్తారు. ఆ మొత్తాన్ని బహిరంగపరిచి మళ్లీ రివర్స్‌ టెండరింగ్‌ నిర్వ హిస్తారు. నిబంధనల ప్రకారం రివర్స్‌ టెండరింగ్‌లో కూ డా బిడ్‌ దాఖలు చేసిన వారే పాల్గొనే అవకాశం ఉంది.

Updated Date - 2020-09-17T10:56:25+05:30 IST