కరోనా సమయంలో.. ట్రాంక్విల్ సంస్థ నుంచి సరికొత్త క్రిమిసంహారకాలు

ABN , First Publish Date - 2020-06-03T01:27:00+05:30 IST

హెచ్1ఎన్1 వైరస్, ట్యూబర్‌క్యులోసిస్ బ్యాక్టీరియాను సైతం నిరోధించగల భారతదేశపు మొట్టమొదటి, ఒకే ఒక్క ధ్రువీకృత క్రిమినాశని ఫార్ములేషన్‌ను ట్రాన్‌క్విల్ స్పెషాలిటీ ప్రొడక్ట్ సంస్థ ఇప్పుడు మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

కరోనా సమయంలో.. ట్రాంక్విల్ సంస్థ నుంచి సరికొత్త క్రిమిసంహారకాలు

ముంబై: హెచ్1ఎన్1 వైరస్, ట్యూబర్‌క్యులోసిస్ బ్యాక్టీరియాను సైతం నిరోధించగల భారతదేశపు మొట్టమొదటి, ఒకే ఒక్క ధ్రువీకృత క్రిమినాశని ఫార్ములేషన్‌ను ట్రాన్‌క్విల్ స్పెషాలిటీ ప్రొడక్ట్ సంస్థ ఇప్పుడు మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ ఫార్ములేషన్ కరోనా కుటుంబానికి చెందిన వైరస్‌లపై కూడా ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలుస్తోంది. అంతేకాదు ఇది పర్యావరణ పరంగా అనుకూలమైనది, ఎఫ్‌డీఏ అనుమతించ పొందినది, అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణమైనది కూడా. జెర్మీగో పేరిట పర్యావరణ అనుకూల ఉత్పత్తులను ట్రాంక్విల్ సంస్థ విడుదల చేస్తోంది.


1. జెర్మిగో సర్ఫేస్ డిస్ఇన్‌ఫెక్టెంట్స్ : ప్రత్యేకమైన సూత్రీకరణ కలిగి ఉండడంతో ఇది ఉపరితలాల్లోనే కాదు గాలిలో కూడా రోగ నాశనిగా పనిచేస్తుంది. అలాగే మాపింగ్, ఫాగింగ్, ఫ్యుమిగేషన్, స్ప్రేయింగ్‌కు అనువుగా ఉంటుంది.


2. జెర్మీగో ఫూస్ ఫూస్ + : బహుళ ప్రయోజనాలు కలిగిన ప్రీమియం 4 ఇన్ 1 ఏరియల్ డిస్ఇన్‌ఫెక్టెంట్ స్ప్రే. పోరస్, నాన్ పోరస్ ఉపరితలాలపై రోగ నాశనిగా పనిచేస్తుంది.


3. జెర్మీగో ఎక్స్ : జెల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్. ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించిన 71% ఆల్కహాల్, హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిగి ఉండటంతో పాటుగా స్విలర్‌తో స్థిరీకరించబడింది. ఇది రెట్టింపు రక్షణ అందిస్తుంది.


ఈ ప్రొడక్ట్స్ విడుదల సందర్భంగా ట్రాన్క్విల్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్/సీఈవో రుషాంగ్ షా మాట్లాడుతూ.. "మనమిప్పుడు సంక్షోభ సమయంలో ఉన్నాము. ఈ సమయంలో మనల్ని మనం కాపాడుకోవడంతోపాటుగా పర్యావరణాన్ని, కుటుంబాన్ని, ఉద్యోగులను కాపాడుకోవటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అందుకు సరైన పరిష్కారాలనూ ఉపయోగించాలి. పరిశుభ్రమైన వాతావరణంలో మనమంతా ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతున్న కాలమిది. అదే సమయంలో మనం ఉపయోగించే క్రిమినాశినిలు మనకే కాదు, పర్యావరణ అనుకూలంగా కూడా ఉండాల్సి ఉంది. కేవలం పర్యావరణ, మానవ, జంతువులకు అనుకూలంగా ఉండేటటువంటి పరిష్కారాలను తీసుకురావడం పట్ల మేము చాలా గర్వగా ఉన్నాము. అంతేకాదు, భారతదేశపు మొట్టమొదటి రోగ నాశినిగా దాదాపుగా అన్ని ప్రాణాంతక, అంటువ్యాధులకు కారణమైన పాథోజెన్స్‌ను మా ఉత్పత్తులు మట్టుబెట్టగలవు'' అని అన్నారు. జెర్మీగో ఉత్పత్తులు ఎఫ్‌డీఏ అనుమతి పొందినవి. సుప్రసిద్ధ సంస్థలైనటువంటి బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్), ముంబైలోని హఫ్కిన్ ఇనిస్టిట్యూట్ తదితర సంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వీటిని పరిశోధించాయి. ఈ ఉత్పత్తులు టీబీ బ్యాక్టీరియా, హెచ్1ఎన్1 వైరస్ (స్వైన్ ఫ్లూ) తదితర పాథోజెన్స్, గాలి లేదా ఉపరితలాల ద్వారా ప్రబలే క్రిములను సైతం నాశనం చేయగలవని ఈ పరిశోదనల్లో తేలిందట. కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎంసీజీఎం, ఎంఎస్ఆర్‌టీసీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆఫ్ మహారాష్ట్ర, ఏపీఎంసీ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పలు కీలక మైన ప్రజా ప్రాంగణాలలో అంటువ్యాధులు ప్రబలకుండా ఈ ఉత్పత్తులనే ఉపయోగిస్తున్నాయని సమాచారం.

Updated Date - 2020-06-03T01:27:00+05:30 IST