రూ.2వేల బిల్లుకు.. రూ.11లక్షల టిప్పు!

ABN , First Publish Date - 2021-06-25T06:07:00+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దీంతో పేద, మధ్య తరగతికి చెందిన వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఓ కస్టమర్ పెద్ద మనసు చాటుకున్నాడు

రూ.2వేల బిల్లుకు.. రూ.11లక్షల టిప్పు!

వాషింగ్టన్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దీంతో పేద, మధ్య తరగతికి చెందిన వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఓ కస్టమర్ పెద్ద మనసు చాటుకున్నాడు. కరోనా నేపథ్యంలో పెరిగిన ఖర్చులను అతికష్టంగా భరిస్తూ.. జీవనాన్ని సాగిస్తున్న ఓ సర్వర్‌కు కళ్లు చెదిరే విధంగా టిప్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 



న్యూ హాంప్‌షైర్‌లోని స్టంబుల్ ఇన్ బార్ అండ్ రెస్టారెంట్‌ను తాజాగా ఓ కస్టమర్ విజిట్ చేశాడు. డ్రింక్‌తోపాటు ఆహార పదార్ధాలను ఆర్డర్ చేసి, 37 డాలర్ల (దాదాపు రూ. 2700) బిల్లు చేశాడు. ఈ క్రమంలో రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పని చేస్తున్న ఓ మహిళ.. బిల్లును అందజేసింది. వెయిటర్‌ నుంచి బిల్లును అందుకున్న కస్టమర్.. దానిపై టిప్పుగా 16వేల డాలర్లు (సుమారు రూ.11లక్షలు) ఇస్తున్నట్టు రాశాడు. అంతేకాకుండా ‘ఈ డబ్బును అంతా ఒకే చోట ఖర్చు చేయకు’ అని చెప్పాడు. దీంతో సదరు మహిళా వెయిటర్‌.. బిల్లుపై టిప్పుగా రాసిన మొత్తాన్ని చూసి అవాక్కయింది. కాగా.. విషయం తెలుసుకున్న రెస్టారెంట్ యజమాని కస్టమర్ ఇచ్చిన టిప్పును తన సిబ్బందికి పంచాడు. అంతేకాకుండా కస్టమర్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. ఆ బిల్లుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ క్రమంలో నెటిజన్లు స్పందిస్తూ కస్టమర్‌ను అభినందిస్తున్నారు. 


Updated Date - 2021-06-25T06:07:00+05:30 IST