కొత్త ఐటీ ఫారం విడుదల

ABN , First Publish Date - 2021-04-02T12:01:56+05:30 IST

ఆదాయ పన్ను శాఖ 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్‌ల ఫైలింగ్‌కు కొత్త ఫారంలను నోటిఫై చేసింది. అయితే ప్రస్తుత కొవిడ్‌ సంక్షోభాన్ని...

కొత్త ఐటీ ఫారం విడుదల

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్‌ల ఫైలింగ్‌కు కొత్త ఫారంలను నోటిఫై చేసింది. అయితే ప్రస్తుత కొవిడ్‌ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం గత ఏడాది ఐటీ ఫారంలలో చెప్పుకోదగ్గ పెద్ద మార్పులేవీ చేయలేదని సీబీడీటీ తెలిపింది. ఫారంలో తొలుత కొత్త ఐటీ ఫారం ఫైల్‌ చేయాలనుకుంటున్నా రా అనే ప్రశ్న వస్తుందని తెలియచేసింది. ఐటీఆర్‌-1లో పన్ను అసెసీలు త్రైమాసికానికి తాము అందుకున్న డివిడెండును రాయాల్సి ఉంటుంది. అధిక సంఖ్యలో ఉండే చిన్న, మధ్యతరహా పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్‌ ఫారం 1 (సహజ్‌), ఐటీఆర్‌ ఫారం 4 (సుగ మ్‌) ఉపయోగపడతాయి. కాగా గడచిన ఆర్థిక సంవత్సరం (2020-21)లో 2.38 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులకు రూ.2.62 లక్షల కోట్ల పన్ను రిఫండ్స్‌ చేసినట్లు ఐటీ శాఖ వెల్లడించింది.

Updated Date - 2021-04-02T12:01:56+05:30 IST