కరోనాలో కొత్త ఉత్పరివర్తన

ABN , First Publish Date - 2020-09-25T07:52:37+05:30 IST

అమెరికాలోని హూస్టన్‌కు చెందిన పరిశోధకులు కొవిడ్‌-19 వైర్‌సలో కొత్త ఉత్పరివర్తనను(మ్యూటేషన్‌) గుర్తించారు...

కరోనాలో కొత్త ఉత్పరివర్తన

  • అమెరికా పరిశోధకుల గుర్తింపు


హూస్టన్‌, సెప్టెంబరు 24: అమెరికాలోని హూస్టన్‌కు చెందిన పరిశోధకులు కొవిడ్‌-19 వైర్‌సలో కొత్త ఉత్పరివర్తనను(మ్యూటేషన్‌) గుర్తించారు. అయితే.. తాజాగా గుర్తించిన వాటిలో ఒక ఉత్పరివర్తన మాత్రం వైర్‌సను మరింత వేగం గా వ్యాప్తి చేసే ప్రమాదం ఉందని వారు వెల్లడించారు. మొత్తం 5వేలకు పైగా జన్యుక్రమాలపై పరిశోధన చేసినట్లు వారు తమ తాజా నివేదికలో వెల్లడించారు. అయితే.. వైరస్‌ మరింత ప్రమాదకరంగా మారిందా లేక క్లినికల్‌గా ఫలితాలను ప్రభావితం చేసేలా ఉందా అనే విషయంపై పరిశోధకులు స్పష్టతనివ్వలేదు. వైర్‌సకు ప్రూఫ్‌ రీడింగ్‌ మెకానిజం ఉంటుందని, అందువల్ల స్థిరంగానే ఉంటుందని వారు తెలిపారు. కానీ.. ఎక్కువమందికి వ్యాప్తి చెందే కొద్దీ.. అది మరిం త ప్రమాదకరంగా పరిణమించేందుకు అవకాశాలున్నాయని వివరించారు. వైర్‌సలో వ్యాప్తి తీవ్రత పెరిగేకొద్దీ.. భౌతిక దూ రం, మాస్కులు వేసుకోవడం వంటి అడ్డంకులను కూడా అధిగమించేందుకు యత్నిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ మేరకు వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక వెల్లడించింది.

Updated Date - 2020-09-25T07:52:37+05:30 IST