60 ఏళ్లకు పైబడిన ప్రవాసుల రెసిడెన్సీ రెన్యువల్ కోసం కొత్త ప్రతిపాదన!

ABN , First Publish Date - 2021-08-15T14:40:07+05:30 IST

60 ఏళ్లకు పైబడిన ప్రవాసుల రెసిడెన్సీ రెన్యువల్ విషయంలో తాజాగా మరో కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

60 ఏళ్లకు పైబడిన ప్రవాసుల రెసిడెన్సీ రెన్యువల్ కోసం కొత్త ప్రతిపాదన!

కువైత్ సిటీ: 60 ఏళ్లకు పైబడిన ప్రవాసుల రెసిడెన్సీ రెన్యువల్ విషయంలో తాజాగా మరో కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. యూనివర్శిటీ డిగ్రీలేని, 60 ఏళ్లకు పైబడిన ప్రవాసులు తమ రెసిడెన్సీ పర్మిట్‌ను రెన్యువల్ చేసుకోవాలంటే 2వేల కువైటీ దినార్లు చెల్లించాల్సిందిగా ఇంతకుముందు కువైత్ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇంత భారీ మొత్తం చెల్లించి ప్రవాసులు రెసిడెన్సీ పర్మిట్‌ను రెన్యువల్ చేసుకోవడం అసాధ్యమని చాలా మంది పెదవి విరిచారు. ఇది ప్రవాసులను పొమ్మనలేక పొగబెట్టడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా కువైత్ మంత్రిమండలి ఓ కొత్త ప్రతిపాదన రూపొందించినట్లు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. రెన్యువల్ ఫీజును 2వేల దినార్ల నుంచి వెయ్యి దినార్లకు తగ్గించాలని మంత్రిమండలి ప్రతిపాదించనుందని తెలుస్తోంది. ఈ వెయ్యి దినార్లలో స్టేట్ ఫీతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా కవర్ అవుతాయని సమాచారం. ఇందులో ఇన్సూరెన్స్ పాలసీ 500 దినార్లుగా మంత్రిమండలి పేర్కొంది. త్వరలోనే ఈ ప్రతిపాదనపై కువైత్ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.     

Updated Date - 2021-08-15T14:40:07+05:30 IST