Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ నివాసితుల వర్క్ పర్మిట్లపై Kuwait లో కొత్త ప్రతిపాదన.. అమల్లోకి వస్తే కొత్తగా వెళ్లేవారికి ఇక్కట్లే..

కువైత్ సిటీ: కువైత్‌లో 60 ఏళ్లకు పైబడి, యూనివర్శిటీ డిగ్రీలేని నివాసితులకు వర్క్ పర్మిట్లు నిషేధించాలని ఇప్పటికే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయితే, తాజాగా ఈ విషయంలో కొత్త ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఈ మేరకు కువైత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆ దేశ ప్రధాని షేక్ సభా అల్ ఖలేద్‌కు కొత్త సూచన చేసింది. ఇలా 60ఏళ్లకు పైబడి, యూనివర్శిటీ డిగ్రీలేని నివాసితులకు వర్క్ పర్మిట్ల జారీని నిలిపివేయాలని చేసిన నిబంధనను ఇప్పటికే దేశంలో ఉన్న నివాసితులకు వర్తింపచేయకుండా, కొత్తగా వచ్చేవారికి దీన్ని అమలు చేస్తే బావుటుందని సూచించింది. ఇలా చేయడం వల్ల ఇప్పటికే దేశంలో ఉన్న 60 ఏళ్లకు పైబడిన నివాసితులపై వెచ్చించిన వ్యయం వృధా కాకుండా ఉంటుందని ఛాంపర్ అధ్యక్షుడు ముహమ్మద్ అల్ సకర్ వివరించారు. అలాగే ఆయా రంగాల్లో మంచి నైపుణ్యం ఉన్న ప్రవాసులను కోల్పోయే ప్రమాదం ఉండదని ఆయన పేర్కొన్నారు. 

అటు 60 ఏళ్లకు పైబడి, యూనివర్శిటీ డిగ్రీలేని వలసదారులు తమ రెసిడెన్సీని రెన్యువల్ చేసుకునేందుకు ఏకంగా 2వేల కువైటీ దినార్లు(సుమారు రూ.5లక్షలు) ఫీజు చెల్లించాల్సి ఉంటుందని కువైత్ ఇప్పటికే ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై కూడా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇంత భారీ మొత్తాన్ని చెల్లించి ప్రవాసులు రెసిడెన్సీ పర్మిట్లను పునరుద్ధరించుకోవడం అసాధ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు. వలసదారులను పొమ్మనలేక పొగపెడుతున్నారని మండిపడుతున్నారు. కువైటైజేషన్‌ లక్ష్యంగా ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోవడం ఎంతమాత్రం సమంజసం కాదని పలువురు చెబుతున్న మాట. దీనిపై కూడా త్వరలోనే కువైత్ మంత్రిమండలి చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.  


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement