డిసెంబరు ఎగుమతుల్లో కొత్త రికార్డు

ABN , First Publish Date - 2022-01-15T08:34:04+05:30 IST

ఇంజనీరింగ్‌, జౌళి, రసాయనాల రంగాలు కనబరచిన ఆరోగ్యవంతమైన వృద్ధితో ఎగుమతుల రంగం 2021 డిసెంబరు నెలలో 38.91 శాతం వృద్ధితో

డిసెంబరు ఎగుమతుల్లో కొత్త రికార్డు

న్యూఢిల్లీ: ఇంజనీరింగ్‌, జౌళి, రసాయనాల రంగాలు కనబరచిన ఆరోగ్యవంతమైన వృద్ధితో ఎగుమతుల రంగం 2021 డిసెంబరు నెలలో 38.91 శాతం వృద్ధితో రాబడిలో కొత్త రికార్డును నమోదు చేసింది. డిసెంబరులో ఎగుమతుల విలువ 3,981 కోట్ల డాలర్లకు (రూ.2.99 లక్షల కోట్లు) పెరిగింది. దేశ చరిత్రలో ఒక నెలలో ఎగుమతి రంగం ఆర్జించిన గరిష్ఠ ఆదాయం ఇదే. 2020 డిసెంబరులో ఎగుమతుల విలువ 2,722 కోట్ల డాలర్లు (రూ.2.04 లక్షల కోట్లు) ఉంది. 2021 డిసెంబరు నెలలో దిగుమతులు 67.89 శాతం పెరిగి 1,616 కోట్ల డాలర్లకు (రూ.1.21 లక్షల కోట్లు) చేరడంతో వాణిజ్య లోటు 2,168 కోట్ల డాలర్లకు (రూ.1.63 లక్షలకోట్లు) పెరిగింది. 

Updated Date - 2022-01-15T08:34:04+05:30 IST