భారత్ నుంచి UAE వెళ్లేవారికి కొత్త ఆంక్షలు

ABN , First Publish Date - 2022-01-05T16:12:42+05:30 IST

కరోనా నేపథ్యంలో భారత్ సహా 12 దేశాల నుంచి యూఏఈ వెళ్లేవారికి తాజాగా కొత్త ప్రయాణ ఆంక్షలు అమలులోకి వచ్చాయి.

భారత్ నుంచి UAE వెళ్లేవారికి కొత్త ఆంక్షలు

దుబాయ్: కరోనా నేపథ్యంలో భారత్ సహా 12 దేశాల నుంచి యూఏఈ వెళ్లేవారికి తాజాగా కొత్త ప్రయాణ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఆయా దేశాల నుంచి యూఏఈ వెళ్లేవారు వీటిని తెలుసుకోవడం తప్పనిసరి. లేనిపక్షంలో అక్కడికెళ్లిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొవడం ఖాయం. ఈ మేరకు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో 12 దేశాల ప్రయాణికులకు పలు సూచనలు చేసింది. బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండియా, ఇండోనేషియా, లెబనాన్, పాకిస్థాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, సుడాన్, యూకే, వియత్నాం, జాంబియా ప్రయాణికులకు ఈ ఆంక్షలు వర్తిస్తాయని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ పేర్కొంది. ఇక ఆంక్షల విషయానికి వస్తే.. ఈ 12 దేశాల ప్రయాణికులకు కోవిడ్-19 పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి. అది కూడా ప్రయాణానికి 48 గంటల ముందు తీసుకున్నది ఉండాలి. అంతేగాక సర్టిఫికేట్‌పై క్యూఆర్ కోడ్ తప్పకుండా ఉండాలి. దుబాయ్ ఎయిర్‌పోర్టులో అక్కడి దుబాయ్ హెల్త్ అథారిటీ(డీహెచ్ఏ) సిబ్బందికి క్యూఆర్ కోడ్‌తో ఉన్న సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. అప్పుడే విమానాశ్రయం నుంచి బయటకు వదలడం జరుగుతుంది. ఈ ఆంక్షలు వెంటనే అమల్లోకి వస్తాయని డీహెచ్ఏ వెల్లడించింది.     

Updated Date - 2022-01-05T16:12:42+05:30 IST