శుక్రవారం నుంచి మచిలీపట్నంలో కొత్త రూల్స్

ABN , First Publish Date - 2020-07-10T02:30:41+05:30 IST

విజయవాడ : జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.

శుక్రవారం నుంచి మచిలీపట్నంలో కొత్త రూల్స్

విజయవాడ : జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా మచిలీపట్నంలో కేసులు పెరుగుతున్న తరుణంలో అధికారులు కొత్త రూల్స్ పెట్టారు. శుక్రవారం నుంచి నగరంలో ఉదయం 6 నుంచి 11గంటల వరకే వ్యాపారాలు చేసుకోవాలని.. ఆ తర్వాత అనుమతి ఉండదని ఆర్డీఓ ఖాజావలీ మీడియా ముఖంగా తెలిపారు. గురువారం సాయంత్రం టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఖాజావలీ.. కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కంటైన్మెంట్ జోన్లల్లో ప్రజలు ఖచ్చితంగా ఇళ్లలోనే ఉండి స్వీయ రక్షణ చర్యలు పాటించాలని సూచించారు.


పోలీస్ సిబ్బందితో మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ టీమ్‌లు కంటైన్మెంట్ జోన్లలో నిత్యం పర్యవేక్షణ సాగిస్తాయన్నారు. మాస్క్ ధారణపై మున్సిపల్, పోలీస్ సిబ్బందితో నగరంలో ఉదయం 6-11గంటల మధ్య స్పెషల్ డ్రైవ్ ఉంటుందని.. మాస్క్ ధరించని వారికి జరిమానా విధించటంతో పాటు కేసులు నమోదు చేస్తామని ఆర్డీఓ హెచ్చరించారు. వ్యాపారాలతో పాటు హోటల్స్ కూడా ఉదయం 6 నుంచి 11గంటల వరకే అనుమతి ఉంటుందన్నారు. ఆ తర్వాత టేక్ ఎ వేకు అనుమతి ఉంటుందని ఖాజావలీ తెలిపారు.

Updated Date - 2020-07-10T02:30:41+05:30 IST