Hyderbad లో తక్కువ ఖర్చుతో కొత్త ట్యాక్సీ సేవలు..

ABN , First Publish Date - 2021-12-03T17:31:53+05:30 IST

హైదరాబాద్‌ సిటీ : నగరవాసులకు తక్కువ ఖర్చుతో ప్రయాణ సేవలందించేందుకు గ్యారల...

Hyderbad లో తక్కువ ఖర్చుతో కొత్త ట్యాక్సీ సేవలు..

హైదరాబాద్‌ సిటీ : నగరవాసులకు తక్కువ ఖర్చుతో ప్రయాణ సేవలందించేందుకు గ్యారల టెక్నాలజీస్‌ విఫ్‌రైడ్‌ పేరుతో బైక్‌, ఆటో, ట్యాక్సీ సేవలను గురువారం ప్రారంభించింది. మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వకీల్‌సాబ్‌ మూవీఫేం నటి అనన్య నాగెల్ల, యాంకర్‌ శ్రీముఖి, బిగ్‌బాస్‌ ఫేం భానుశ్రీతో కలిసి సంస్థ సీఈఓ సందీప్‌ ఈ సేవలను ప్రారంభించారు. డ్రైవర్ల శ్రమను గుర్తించి ప్రతి రైడ్‌కు కాకుండా రోజుకు ఒకసారి మాత్రమే చార్జీలు వసూలు చేస్తున్నట్లు సందీప్‌ తెలిపారు.

Updated Date - 2021-12-03T17:31:53+05:30 IST