Abn logo
Aug 14 2020 @ 14:04PM

‘ఆర్ఆర్ఆర్‌’కు కొత్త స‌మ‌స్య‌!!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’. క‌రోనా ఎఫెక్ట్ వ‌ల్ల తుది ద‌శ షూటింగ్ ఆగింది. క‌రోనా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డ త‌ర్వాత రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. ఇందులో రామ్‌చ‌ర‌ణ్ జోడీగా బాలీవుడ్ న‌టి ఆలియా భ‌ట్ జోడీ క‌ట్ట‌నుందనే సంగ‌తి తెలిసిందే. ఇన్ని రోజుల ఆలియా భ‌ట్ త‌మ సినిమాకు ప్ల‌స్ అవుతుంద‌ని భావించిన ఆర్ఆర్ఆర్ యూనిట్‌కు కొత్త స‌మ‌స్య వ‌చ్చింది. ఇంత‌కూ ఏమిటా స‌మ‌స్య అనుకుంటున్నారు?  నెపోటిజం. 


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య కేసులో బాలీవుడ్‌లోని నెపోటిజంపై పెద్ద దుమార‌మే రేగుతోంది. ఈ క్ర‌మంలో మ‌హేశ్‌భ‌ట్‌, ఆలియా భ‌ట్ స‌హా సినీ వార‌సుల‌పై నెటిజ‌న్స్ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌హేశ్‌భ‌ట్ ద‌ర్శ‌క‌త్వంలో సంజ‌య్‌ద‌త్‌, ఆదిత్య‌రాయ్‌క‌పూర్‌, ఆలియాభ‌ట్ న‌టించిన ‘సడక్ 2’ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ మోస్ట్ డిస్‌లైక్డ్ ట్రైల‌ర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇదే నెపోటిజం ఎఫెక్ట్ త‌మ సినిమాపై ప‌డుతుందేమోన‌ని ఆర్ఆర్ఆర్ యూనిట్‌లో చిన్న‌టెన్ష‌న్ మొద‌లైంద‌ట‌. 


Advertisement
Advertisement
Advertisement