బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు గుర్తించే సరికొత్త పరికరం

ABN , First Publish Date - 2020-03-24T09:45:12+05:30 IST

రక్తంలోని హానికారక బ్యాక్టీరియాను గుర్తించగలిగే ఓ పరికరాన్ని అమెరికాలోని రోచెస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. తద్వారా బ్యాక్టీరియాలతో సోకే ప్రాణాంతక...

బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు గుర్తించే సరికొత్త పరికరం

వాషింగ్టన్‌, మార్చి 23 : రక్తంలోని హానికారక బ్యాక్టీరియాను గుర్తించగలిగే ఓ పరికరాన్ని అమెరికాలోని రోచెస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. తద్వారా బ్యాక్టీరియాలతో సోకే ప్రాణాంతక ఇన్ఫెక్షన్లను కచ్చితత్వంతో గుర్తించి, తగిన ఔషధాల వాడకంతో కట్టడి చేయవచ్చని వెల్లడించారు. చిన్న సైజులో ఉండే ఈ పరికరానికి అయస్కాంత శక్తి కలిగిన పూసలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా అమరి ఉంటాయి. శరీర ద్రవాల్లోని బ్యాక్టీరియా, దానికి సంబంధించిన హానికారక కణాలు ఈ పూసల మధ్య ఉండే చిన్నపాటి ప్రదేశాల్లో ఇంకిపోతాయి. ఆ విధంగా పరికరంలోకి చేరే బ్యాక్టీరియాలను విశ్లేషించి.. ఇన్ఫెక్షన్లకు గల కచ్చితమైన కారణాలను తెలుసుకుంటారు.

Updated Date - 2020-03-24T09:45:12+05:30 IST