సీఎం, డిప్యూటీ సీఎం మధ్య పోస్టర్ యుద్ధం

ABN , First Publish Date - 2021-06-24T02:40:42+05:30 IST

కొంత కాలం క్రితం తన మద్దతుదారులతో కలిసి సీఎం గెహ్లాత్‌పై తిరుగుబాటు చేసిన సచిన్.. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన కొన్ని హామీలతో వెనక్కి తగ్గారు. అయితే తనకు అంతకుముందు ఉన్న పీసీసీ అధ్యక్ష పదవితో పాటు

సీఎం, డిప్యూటీ సీఎం మధ్య పోస్టర్ యుద్ధం

జైపూర్: రాజస్తాన్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మధ్య అనేక విబేధాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇది తాజాగా కొత్త మలుపు తిరిగింది. జైపూర్‌లో సచిన్ పైలట్‌కు అనుకూలంగా ఏర్పాటు చేసిన పోస్టర్లకు తాజా యుద్ధానికి కారణం. జైపూర్‌లోని చాలా ప్రాంతాంల్లో సచిన్ పైలట్ గొప్పగా పని చేస్తున్నట్లు ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున పోస్టర్లు అతికించారు. అయితే ఇది అశోక్ గెహ్లాత్‌ను ఇబ్బందికి గురి చేసింది. పైలట్ అంతగా చేసింది ఏమీ లేదని అతని సన్నిహిత వర్గాలతో గెహ్లాత్ అన్నట్లు సమాచారం. గెహ్లాత్ వ్యాఖ్యలపై పైలట్ అనుచరులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.


కొంత కాలం క్రితం తన మద్దతుదారులతో కలిసి సీఎం గెహ్లాత్‌పై తిరుగుబాటు చేసిన సచిన్.. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన కొన్ని హామీలతో వెనక్కి తగ్గారు. అయితే తనకు అంతకుముందు ఉన్న పీసీసీ అధ్యక్ష పదవితో పాటు ఉపముఖ్యమంత్రి పదవి కూడా పోయింది. అప్పటి నుంచి పైలట్‌పై మరింత కక్షసాధింపుగా గెహ్లాత్ వ్యవహరిస్తున్నారనే విమర్శలు అనేకం ఉన్నాయి. ఇదే కాకుండా తాజాగా జరిగిన కేబినెట్ విస్తరణలో పైలట్ వర్గంలోని ఎమ్మెల్యలకు సరైన ప్రాధాన్యం లభించలేదు. ఇది పైలట్‌తో పాటు అతని వర్గీయుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందట.

Updated Date - 2021-06-24T02:40:42+05:30 IST