Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారత్‌కు న్యూయార్క్ న‌గ‌రం భారీ సాయం!

న్యూయార్క్‌: క‌రోనా సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న భార‌త్‌కు ఇప్ప‌టికే అగ్ర‌రాజ్యం అమెరికా భారీ స‌హాయం అందిస్తూ బాస‌ట‌గా నిలుస్తోంది. అలాగే అక్క‌డి ప‌లు కార్పొరేట్‌ కంపెనీలు, భార‌తీయ అమెరికన్లు సైతం త‌మ‌వంతు సాయంతో క‌రోనా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న భార‌త‌దేశానికి ఆప‌న్న హ‌స్తం అందిస్తున్నారు. తాజాగా అమెరికాలోని న్యూయార్క్ న‌గ‌రం భార‌త్‌కు మ‌ద్ద‌తుగా నిలిచింది. మ‌హ‌మ్మారితో పోరాడుతున్న భార‌త్‌కు భారీగా వైద్య సామాగ్రి పంపిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సుమారు 4 మిలియ‌న్ల క‌రోనా టెస్టు కిట్లు, 3 ల‌క్ష‌ల ప‌ల్స్ ఆక్సీమీట‌ర్లు, 300 వెంటిలేట‌ర్లతో పాటు ఇత‌ర కీల‌క‌ వైద్య ప‌రిక‌రాలు పంపించ‌నున్న‌ట్లు ఆ న‌గ‌ర‌ మేయర్ బిల్ డి బ్లాసియో ప్రెస్ సెక్రటరీ బిల్ నీధార్డ్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త్వ‌ర‌గా భార‌త్ క‌రోనా సంక్షోభం నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని ఆకాంక్షించారు.


Advertisement

అమెరికా నగరాల్లోమరిన్ని...

Advertisement