న్యూయార్క్ కాల్పుల కేసులో అనుమానితుడు అరెస్టు!

ABN , First Publish Date - 2021-05-14T04:23:33+05:30 IST

కొన్ని రోజుల క్రితం అమెరికాలోని ప్రధాన నగరమైన న్యూయార్క్ నగరంలో తుపాకీ మోత గర్జించింది. ఇక్కడి టైమ్స్ స్క్వేర్ వద్ద ఒక వ్యక్తి తుపాకీతో వీరంగం సృష్టించాడు.

న్యూయార్క్ కాల్పుల కేసులో అనుమానితుడు అరెస్టు!

ఫ్లోరిడా: కొన్ని రోజుల క్రితం అమెరికాలోని ప్రధాన నగరమైన న్యూయార్క్ నగరంలో తుపాకీ మోత గర్జించింది. ఇక్కడి టైమ్స్ స్క్వేర్ వద్ద ఒక వ్యక్తి తుపాకీతో వీరంగం సృష్టించాడు. రోడ్డుపై వెళ్తున్న వారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక నాలుగేళ్ల పాప సహా నలుగురు మృత్యువాత పడ్డారు. అక్కడి నుంచి నిందితుడు పరారయ్యాడు. ఈ కేసులో అనుమానితుడైన ఫరాఖాన్ ముహమ్మద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సదరు అనుమానితుడిని ఫ్లోరిడాలో అరెస్టు చేసినట్లు న్యూయార్క్ పోలీసులు వెల్లడించారు.


అతన్ని జాక్సన్‌విల్లెలోని మెక్‌డొనాల్డ్స్ స్టోర్ పార్కింగ్ నుంచి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గత శనివారం రాత్రి అమెరికాను సందర్శించే వారు ఎక్కువగా వచ్చే టూరిస్టు ప్రాంతమైన టైమ్స్ స్క్వేర్‌లో ఈ కాల్పుల ఘటన జరిగిన సంగతి తెలిసిందే.

Updated Date - 2021-05-14T04:23:33+05:30 IST