New York వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కొత్త సమస్య..!

ABN , First Publish Date - 2021-12-22T21:10:11+05:30 IST

అమెరికాలోని న్యూయార్క్ వాసులకు వరుస సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒకవైపు కరోనా మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు.

New York వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కొత్త సమస్య..!

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ వాసులకు వరుస సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒకవైపు కరోనా మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు. ఇవి చాలవంటూ ఇప్పుడు మరో కొత్త సమస్య వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. న్యూయార్క్ వాసులు ఈ కొత్త సమస్యతో అల్లాడిపోతున్నారు. నగరంలోని ప్రజలు ఎలుకల బెడదతో తలలు పట్టుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఎలుకలే కనిపిస్తున్నాయట. ఒక్క న్యూయార్క్ సిటీలోనే ఏకంగా రెండు మిలియన్ల(20లక్షలు) వరకు ఎలుకలు వీర విహారం చేస్తున్నాయట. రోడ్లు, డ్రైనేజ్, పార్కులు, సబ్‌వేలు, షూ స్టోర్స్, రెస్టారెంట్స్ ఇలా ప్రతిచోట ఎక్కడ చూసినా ఎలుకలే దర్శనమిస్తున్నాయి. దీంతో ఎలుకల బెడద తట్టుకోలేక వ్యాపార సముదాయాల యజమానులు, సామాన్య ప్రజలు వాటిని నివారించాల్సిందిగా ప్రభుత్వానికి వినతులతో హోరెత్తిస్తున్నారు. 


ఇక సాధారణంగా అక్కడి ఎలుకలను పట్టుకునేందుకు వేట కుక్కులను వినియోగిస్తుంటారు సంబంధిత అధికారులు. ఇప్పుడు కూడా అదే పద్దతిని అనుసరిస్తున్నారు. కానీ, భారీ సంఖ్యలో ఉన్న ఎలుకలను పట్టుకోవడం వాzr తలకుమించిన భారంగా మారుతోంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న వేట కుక్కలు ఒక్కొక్కటి రోజుకు కేవలం 20 ఎలుకలను మాత్రమే పట్టుకోగలవు. నగరవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్న ఎలుకలను పట్టుకోవాలంటే వేట కుక్కల వల్ల అయ్యే పని కాదని జనాలు చెబుతున్నారు. అందుకే ఏదైనా నూతన పద్దతిలో ఎలుకల సంహరణకు పరిష్కారం చూడాలని అధికారులను కోరుతున్నారు. దాంతో అక్కడి ప్రభుత్వం ఈ విషయమై ఆలోచిస్తోంది.


ప్రస్తుతం న్యూయార్క్ సిటీలో ఈ సమస్య ఏ స్థాయిలో ఉందంటే.. అటు కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ను కూడా జనాలు అంతగా పట్టించుకోవడం లేదట. కానీ, ఎలుకల  బెడదతో పడరానిపాట్లు పడుతున్నారు. 2019 ఏడాదితో పోల్చుకుంటే 2021లోని 11 నెలల్లో ఏకంగా 40 శాతం మేర ఎలుకలు పెరిగినట్లు డ్రైనేజి, క్లీనింగ్ డిపార్ట్‌మెంట్ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. 2017లో నగర మేయర్ బిల్ డీ బ్లాసియో ఎలుకలను పట్టుకునే కార్యక్రమం కోసం ఏకంగా 32 మిలియన్ డాలర్లతో ఓ బిల్లును కూడా తీసుకువచ్చారు. అయినా వాటి సంఖ్యను మాత్రం తగ్గించలేకపోయారు. ఇప్పుడ ఎలుకల సంఖ్య మరింత పెరగడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 



Updated Date - 2021-12-22T21:10:11+05:30 IST