న్యూయార్క్‌లో పూర్తిగా అదుపులోకి వస్తున్న మహమ్మారి

ABN , First Publish Date - 2020-08-09T06:06:48+05:30 IST

అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం ఏప్రిల్, మే నెలల్లో కరోనాకు కేంద్రంగా ఉండేది.

న్యూయార్క్‌లో పూర్తిగా అదుపులోకి వస్తున్న మహమ్మారి

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం ఏప్రిల్, మే నెలల్లో కరోనాకు కేంద్రంగా ఉండేది. నిత్యం వందలాది మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతూ వచ్చారు. అయితే న్యూయార్క్ ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరిస్తూ రాష్ట్రం మొత్తం లాక్‌డౌన్ విధించింది. దీంతో మహమ్మారి వ్యాప్తి తగ్గుతూ వచ్చింది. ఇక ఇప్పుడు కరోనా కేసుల సంఖ్యలో భారీగా తగ్గుదల కనపడుతోంది. లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేసినప్పటికి న్యూయార్క్‌లో కరోనా వ్యాప్తి కనిపించడం లేదు. గత కొద్ది రోజులుగా న్యూయార్క్‌లో కరోనా కేసుల పాజిటివ్ రేటు కూడా ఒక శాతానికి అటు ఇటుగానే ఉంటోంది. శుక్రవారం రాష్ట్రంలో 74,857 కరోనా శాంపిల్స్‌ను పరీక్షించగా.. 703(0.93 శాతం) మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కొత్తగా నమోదైన కేసులతో న్యూయార్క్‌లో మొత్తం కేసుల సంఖ్య 4,48,991కు చేరింది. ఇక శుక్రవారం న్యూయార్క్‌లో ఐదుగురు కరోనా కారణంగా మరణించడంతో.. మొత్తం మరణాల సంఖ్య 25,195కు చేరింది. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నా.. న్యూయార్క్‌లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో అన్నారు. న్యూయార్క్ ప్రజల క్రమశిక్షణ వల్లే ఇది సాధ్యమైందన్నారు. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక అమెరికా వ్యాప్తంగా కరోనా కేసులు 50 లక్షలకు చేరువలో ఉండగా.. మరణాలు లక్షా 60 వేలు దాటాయి. 

Updated Date - 2020-08-09T06:06:48+05:30 IST