న్యూయార్క్ వీధికి భారత మూలాలున్న వ్యక్తి పేరు

ABN , First Publish Date - 2021-07-18T21:32:20+05:30 IST

అమెరికాలో భారత మూలలు ఉన్న వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లోని ఓ వీధికి భారత్‌కు చెం

న్యూయార్క్ వీధికి భారత మూలాలున్న వ్యక్తి పేరు

వాషింగ్టన్: అమెరికాలో భారత మూలలు ఉన్న వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లోని ఓ వీధికి భారత్‌కు చెందిన ఓ వ్యక్తి పేరును పెట్టారు. ఇందుకు సంబంధించిన అధికార వేడుకలు క్వీన్ రిచ్‌మండ్ హిల్‌లో జరిగాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


న్యూయార్క్‌లోని లిబర్టీ అవెన్యూ 133వ వీధికి భారత మూలాలున్న రామ్‌లాల్ పేరు పెట్టాలని ఇండో-కరేబియన్స్ నుంచి సిటీ మేయర్స్‌కు ప్రతిపాధనలు వెళ్లాయి. దీంతో న్యూయార్క్ మేయర్ బిల్ డె బ్లాసియో జూన్ 27న సంతకం చేశారు. దీంతో ఆ వీధి ‘పండిట్ రామ్‌లాల్’ స్ట్రీట్‌గా మారిపోయింది. కాగా.. అట్టహాసంగా జరిగిన ప్రారంభ వేడుకల్లో సిటీ కౌన్సిల్ అడ్రిన్నె అడమ్స్ పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. గుయానా స్కెల్‌డాన్‌లో భారత మూలాలున్న కుటుంబంలో రామ్‌లాల్ పుట్టారు. అక్కడ జరిగిన స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఇండో-కరేబియన్ లీడర్లలో ఒకరిగా ఎదిగిన ఆయన.. 90ఏళ్ల వయసులో 2019లో కన్నుమూశారు. 


Updated Date - 2021-07-18T21:32:20+05:30 IST