న్యూఢిల్లీ : న్యూజిలాండ్ ఎన్నికల్లో లేబర్ పార్టీ తరపున ఎంపీగా గెలుపొందిన గౌరవ్ శర్మ ఆ దేశ పార్లమెంట్‌లో సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విషయాన్ని భారత హైకమిషనర్ ముక్తేశ్ పర్దేశి తెలిపారు. గౌరవ్ శర్మ భారత సంతతికి చెందిన యువ వైద్యుడు. దీంతో సంస్కృతంలో ప్రమాణం చేసిన రెండో భారత సంతతి వ్యక్తిగా నిలిచారు. ఆక్లాండ్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన గౌరవ్ శర్మ వాషింగ్టన్ లో ఎంబీఏ పూర్తి చేశారు. సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ... అన్ని భారతీయ భాషలకూ గౌరవం దక్కుతుందని భావించే సంస్కృతంలో ప్రమాణం చేశానని తెలిపారు.