125 ఏళ్ల రికార్డు బ్రేక్‌

ABN , First Publish Date - 2021-06-04T09:23:26+05:30 IST

న్యూజిలాండ్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే (200) చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌ గడ్డపై టెస్ట్‌ అరంగేట్రంలో అత్యధిక స్కోరు చేసిన బ్యాట్స్‌మన్‌గా 125 ఏళ్ల రికార్డును ఈ లెఫ్ట్‌హ్యాండర్‌ బద్దలుగొట్టాడు.

125 ఏళ్ల రికార్డు బ్రేక్‌

కివీస్‌ బ్యాట్స్‌మన్‌ కాన్వే ఘనత


లండన్‌: న్యూజిలాండ్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే (200) చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌ గడ్డపై టెస్ట్‌ అరంగేట్రంలో అత్యధిక స్కోరు చేసిన బ్యాట్స్‌మన్‌గా 125 ఏళ్ల రికార్డును ఈ లెఫ్ట్‌హ్యాండర్‌ బద్దలుగొట్టాడు. సౌతాఫ్రికాలో జన్మించిన 29 ఏళ్ల డెవాన్‌..ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో గురువారంనాటి ఇన్నింగ్స్‌తో భారత్‌కు చెందిన లెజెండరీ బ్యాట్స్‌మన్‌ రంజీత్‌సిం్‌హ జీ రికార్డును తిరగరాశాడు. రంజీత్‌ సింహ్‌ జీ 1896లో ఆస్ట్రేలియాపై మాంచెస్టర్‌లో టెస్ట్‌ అరంగేట్రంలో అజేయంగా 154 పరుగులు చేశాడు. అయితే రంజీత్‌ సింహ్‌ బ్రిటిష్‌ ఇండియా తరపున ఇంగ్లండ్‌ ఆటగాడిగా ఆ రికార్డు నెలకొల్పాడు. దానిని ఇప్పుడు డెవాన్‌ బ్రేక్‌ చేశాడు. ఇక ఇంగ్లండ్‌కే చెందిన డబ్ల్యూజీ గ్రేస్‌ తన తొలి టెస్ట్‌లో ఆసీ్‌సపై మాంచెస్టర్‌లో 1880లో 150 రన్స్‌ చేశాడు. 


ఇంగ్లండ్‌ 103/2:

న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో మొదటి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ గురువారం, రెండోరోజు కడపటి వార్తలు అందేసరికి రెండు వికెట్లకు 103 స్కోరు చేసింది. ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ (56), కెప్టెన్‌ జో రూట్‌ (38) క్రీజులో ఉన్నారు. అంతకుముందు..246/3 స్కోరుతో మొదటి ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌ 378 పరుగులకే ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ 136 స్కోరుతో ఉన్న కాన్వే తన అమోఘ ఇన్నింగ్స్‌ కొనసాగించి డబుల్‌ సెంచరీ సాధించాడు. అతడికి సహకారం అందించిన నికోల్స్‌ కూడా హాఫ్‌ సెంచరీ చేశాడు. రాబిన్సన్‌ నాలుగు (4/75) వికెట్లు పడగొట్టారు. 

Updated Date - 2021-06-04T09:23:26+05:30 IST