Advertisement
Advertisement
Abn logo
Advertisement

India vs New Zealand: భారత్‌కు దీటుగా బదులిస్తున్న కివీస్.. యంగ్ అర్ధ సెంచరీ

కాన్పూరు: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ నిలకడగా ఆడుతోంది. భారత జట్టు 345 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించాక బ్యాటింగ్‌ ప్రారంభించిన కివీస్ దీటుగా ఆడుతోంది. ఓపెనర్లు టామ్ లాథమ్, విల్ యంగ్ టీమిండియా బౌలర్లను సమయోచితంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డుపై పరుగులు పెంచుకుంటూ పోతున్నారు. కెప్టెన్ రహానే మార్చిమార్చి బౌలర్లను ప్రయోగిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 


ఈ క్రమంలో కివీస్ ఓపెనర్లు 239 బంతుల్లో సెంచరీ (101) భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. విల్ యంగ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని దూకుడు ప్రదర్శిస్తుండగా, టాప్ లాథమ్ అతడికి సంపూర్ణ సహకారం అందిస్తున్నాడు. ప్రస్తుతం 40 ఓవర్లు ముగిశాయి. లాథమ్ 34, యంగ్ 64 పరుగులతో క్రీజులో ఉన్నారు. 


అంతకుముందు ఈ ఉదయం ఓవర్‌నైట్ స్కోరు 258/4తో రెండో రోజు తొలి  ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 345 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి రోజు సూపర్ షోతో ఆకట్టుకున్న శ్రేయాస్ అయ్యర్ సెంచరీ (105) చేసి అవుటగా, రవీంద్ర జడేజా (50), అశ్విన్ 38 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ 5, జెమీసన్ 3, అజాజ్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు.

Advertisement
Advertisement