New Zealand: ఉగ్రవాదుల దాడిలో ఏడుగురికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2021-09-04T15:48:35+05:30 IST

న్యూజిలాండ్ దేశంలోని ఆక్లాండ్ నగరంలో ఉగ్ర దాడి జరిగిందని ఆ దేశ ప్రధానమంత్రి జసిందా అర్డెన్ శనివారం చెప్పారు....

New Zealand: ఉగ్రవాదుల దాడిలో ఏడుగురికి తీవ్ర గాయాలు

ఆక్లాండ్ : న్యూజిలాండ్ దేశంలోని ఆక్లాండ్ నగరంలో ఉగ్ర దాడి జరిగిందని ఆ దేశ ప్రధానమంత్రి జసిందా అర్డెన్ శనివారం చెప్పారు. ఆక్లాండ్ నగరంలోని ఓ సూపర్ మార్కెట్ లో ఓ వ్యక్తి ఏడుగురిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఐదుగురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ప్రధాని జసిందా చెప్పారు. సూపర్ మార్కెటులో దాడి చేసిన దుండుగుడిని పోలీసులు కాల్చి చంపారు. దుండగుడు 2011వ సంవత్సరంలో శ్రీలంక నుంచి న్యూజిలాండ్ దేశానికి వచ్చాడని ప్రధాని చెప్పారు. దుండగుడు ఉగ్రవాది అని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగుడు కత్తితో దాడికి పాల్పడటం ఉగ్రవాద చర్య అని ప్రధాని జసిందా పేర్కొన్నారు. 


Updated Date - 2021-09-04T15:48:35+05:30 IST