New Zealand: ఫైజర్ కొవిడ్ టీకా వేసుకున్న మహిళ మృతి

ABN , First Publish Date - 2021-08-30T15:39:14+05:30 IST

ఫైజర్ కొవిడ్ -19 టీకా వేయించుకున్న ఓ మహిళ మరణించిన ఘటన న్యూజిలాండ్ దేశంలో సోమవారం వెలుగుచూసింది....

New Zealand: ఫైజర్ కొవిడ్ టీకా వేసుకున్న మహిళ మృతి

వెల్లింగ్‌టన్ (న్యూజిలాండ్): ఫైజర్ కొవిడ్ -19 టీకా వేయించుకున్న ఓ మహిళ మరణించిన ఘటన న్యూజిలాండ్ దేశంలో సోమవారం వెలుగుచూసింది. న్యూజిలాండ్ దేశంలో ఫైజర్ కొవిడ్ టీకా వేయించుకున్న ఓ మహిళ మరణించిందని, ఇది వ్యాక్సిన్ మొదటి మరణమని న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.ఫైజర్ కొవిడ్-19 వ్యాక్సిన్ వల్ల అరుదైన సైడ్ ఎఫెక్ట్ మయోకార్డిటిస్ వల్ల మహిళ మరణించిందని వ్యాక్సిన్ భద్రతా పర్యవేక్షణ బోర్డు పేర్కొంది. మయోకార్డిటిస్ గుండె కండరాల వాపు వల్ల హృదయ స్పందనల్లో మార్పులకు కారణమైంది. వ్యాక్సిన్ మృతిపై విచారణకు ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదేశించింది. ఇప్పటివరకు ఫైజర్, బయోఎంటెక్, జాన్సన్, ఆస్ట్రాజెనెకా టీకాలను న్యూజిలాండ్ అధికారులు తాత్కాలికంగా ఆమోదించారు.న్యూజిలాండ్ దేశంలో సోమవారం 53 కరోనా డెల్టా వేరియంట్ కేసులు నమోదైనాయి.


Updated Date - 2021-08-30T15:39:14+05:30 IST