ఆ దేశంలో సిగరెట్లపై పూర్తి నిషేధం.. త్వరలో యాంటీ స్మోకింగ్ చట్టం

ABN , First Publish Date - 2021-12-10T11:12:05+05:30 IST

కాన్సర్ కారక సిగరెట్లపై న్యూజిల్యాండ్ ప్రభుత్వం.. దశల వారీగా నిషేధం విధిస్తూ త్వరలో చట్టం తీసుకురానుంది. ఈ చ‌ట్ట ప్ర‌కారం ముఖ్యంగా 2008 త‌రువాత జ‌న్మించిన‌ యువ‌తకు సిగ‌రెట్లు విక్ర‌యించ‌కూడ‌దు...

ఆ దేశంలో సిగరెట్లపై పూర్తి నిషేధం.. త్వరలో యాంటీ స్మోకింగ్ చట్టం

కాన్సర్ కారక సిగరెట్లపై న్యూజిల్యాండ్ ప్రభుత్వం..  దశల వారీగా నిషేధం విధిస్తూ త్వరలో చట్టం తీసుకురానుంది.  ఈ చ‌ట్ట ప్ర‌కారం ముఖ్యంగా 2008 త‌రువాత జ‌న్మించిన‌ యువ‌తకు సిగ‌రెట్లు విక్ర‌యించ‌కూడ‌దు. న్యూజిల్యాండ్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై ప్ర‌పంచవ్యాప్తంగా డాక్ట‌ర్లు, ఆరోగ్య నిపుణులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.


న్యూజిల్యాండ్‌లో ప్ర‌తి ఏడాది 4,500 నుంచి 5,000 మంది అంటే రోజుకు 12 నుంచి 15 మంది ధూమ‌పానం వ‌ల్ల చ‌నిపోతున్నార‌ని ప్ర‌భుత్వం తెలిపింది. ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి డాక్ట‌ర్ ఆయేషా వెరాల్ మాట్లాడుతూ.. “దేశ భావిత‌రానికి స్మోకింగ్ నుంచి విముక్తి క‌లిగించ‌డానికే ఈ నిర్ణ‌యం తీసుకున్నాం” అని అన్నారు. 2027 నాటికి దేశంలో ధూమపానంపై సంపూర్ణ నిషేధం తీసుకువస్తామని ఆమె చెప్పారు.


స్మోకింగ్‌ని బ్యాన్ చేయ‌డానికి క్ర‌మ‌క్ర‌మంగా సిగ‌రెట్లు విక్ర‌యించే షాపుల‌ను త‌గ్గిస్తామ‌ని, అలాగే.. సిగ‌రెట్లలో నికోటిన్ శాతం కూడా త‌క్కువ ఉండేలా చ‌ట్టాలు తీసుకువ‌స్తామ‌ని ఆమె తెలిపారు.

Updated Date - 2021-12-10T11:12:05+05:30 IST