యమునా నదిలో తేలిన నవజాత శిశువు

ABN , First Publish Date - 2021-05-07T15:26:07+05:30 IST

మధుర నగరంలోని యమునా నదిలో నవజాత శిశువు నీటిపై ఇనుపరేకుపై తేలుతుండటంతో స్థానికులు చూసి రక్షించారు....

యమునా నదిలో తేలిన నవజాత శిశువు

కాపాడి ఆసుపత్రికి తరలించిన పోలీసులు

మధుర : మధుర నగరంలోని యమునా నదిలో నవజాత శిశువు నీటిపై ఇనుపరేకుపై తేలుతుండటంతో స్థానికులు చూసి రక్షించారు. నవవాన్ బృందావన్ లోని చాముండా ఘాట్ వద్ద ఇనుపరేకుపై నదిలో తేలుతున్న నవజాత శిశువు కనిపించడంతో అతన్ని కాపాడిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు శిశువును ఆసుపత్రికి తరలించారు. పోలీసులు శిశువును నదిలో వదిలిపెట్టిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. 


మధుర జిల్లా ఆసుపత్రిలోని పిల్లల వార్డులో శిశువును చేర్పించారు. శిశువును తెల్లటివస్త్రంతో చుట్టి నదిలో వదిలారని, శిశువు ఏడుస్తుండగా ఆసుపత్రికి తరలించామని పోలీసు సబ్ ఇన్ స్పెక్టరు మనోజ్ శర్మ చెప్పారు. శిశువును ఎవరూ దత్తత తీసుకునేందుకు సముఖంగా లేకుంటే జిల్లా యంత్రాంగం అనుమతితో శిశువును చూసుకుంటామని హిందూస్థానీ బిరాదరి వైస్ ఛైర్మన్ విశాల్ శర్మ చెప్పారు. 


Updated Date - 2021-05-07T15:26:07+05:30 IST