హిందువుగా మారిన రిజ్వీ

ABN , First Publish Date - 2021-12-07T07:02:15+05:30 IST

యూపీ షియా సెంట్రల్‌ వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్‌ వసీం రిజ్వీ ఇస్లాంను వీడి హిందూ ధర్మాన్ని స్వీకరించారు. తన మరణానంతరం భౌతికకాయాన్ని దహనం చేయాలని...

హిందువుగా మారిన రిజ్వీ

న్యూఢిల్లీ, డిసెంబరు 6: యూపీ షియా సెంట్రల్‌ వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్‌ వసీం రిజ్వీ ఇస్లాంను వీడి హిందూ ధర్మాన్ని స్వీకరించారు. తన మరణానంతరం భౌతికకాయాన్ని దహనం చేయాలని, చితికి ఘజియాబాద్‌ దస్నా ఆలయానికి చెందిన యోగి మహంత్‌ నర్సింహానంద సరస్వతి నిప్పు పెట్టాలని ఆకాంక్షించారు. నర్సింహానంద సంప్రదాయ క్రతువుల మధ్య హిందూ రిజ్వీని ధర్మంలోకి ఆహ్వానించారు. కాగా ఉగ్రవాదాన్ని, జిహాద్‌ను ప్రేరేపించే విధంగా ఉన్నాయనే ఆరోపణలతో ఖురాన్‌లోని 26 వచనములను తొలగించాలంటూ వసీం రిజ్వీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయడం వివాదాస్పమైంది. అయితే రిజ్వీ వేసిన పిటిషన్‌ అర్థంలేనిదంటూ సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Updated Date - 2021-12-07T07:02:15+05:30 IST