కొత్తగా 12,561 కరోనా కేసులు..

ABN , First Publish Date - 2022-01-29T09:03:23+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40,635 శాంపిల్స్‌ను పరీక్షించగా 12,561 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది.

కొత్తగా 12,561 కరోనా కేసులు..

  • 24 గంటల్లో 12 మంది మృత్యువాత
  • 1.13 లక్షలకు పెరిగిన యాక్టివ్‌ కేసులు
  • 30.91 శాతం పాజిటివిటీ రేటు నమోదు


అమరావతి, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40,635 శాంపిల్స్‌ను పరీక్షించగా 12,561 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. పాజిటివిటీ రేటు 30.91 శాతంగా నమోదైంది. తాజాగా కర్నూలు జిల్లాల్లో అత్యధికంగా 1,710 కేసులు నమోదవగా.. గుంటూరులో 1,625, కడపలో 1,215, విశాఖఫట్నంలో 1,211, తూర్పుగోదావరిలో 1,067, కృష్ణాలో 1,056, నెల్లూరులో 1,009 కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడిన వారి సంఖ్య  22,48,608కి పెరిగింది. వారిలో 21,20,717 మంది కోలుకున్నారు. శుక్రవారం కొత్తగా 8,742 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 12 మంది కొవిడ్‌తో మరణించారు.


విశాఖపట్నంలో ముగ్గురు మృతిచెందగా.. కర్నూలు, నెల్లూరులలో ఇద్దరేసి, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, విజయనగరం, పశ్చిమగోదావరిల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కరోనా మరణాలు 14,591కి పెరిగాయి. మరోవైపు రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 1,13,300కి పెరిగాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 12,315 మంది కరోనాకు చికిత్స పొందుతుండగా.. విశాఖపట్నంలో 12,272, ప్రకాశంలో 12,189, నెల్లూరులో 11,369, తూర్పుగోదావరిలో 10,010 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Updated Date - 2022-01-29T09:03:23+05:30 IST