కరోనా మృత్యు పంజా!

ABN , First Publish Date - 2021-04-15T09:39:48+05:30 IST

సెకండ్‌ వేవ్‌లో కరోనా మృత్యుఘంటికలు మోగిస్తోంది. గత 24 గంటల్లో 4,157 మందికి పాజిటివ్‌గా నిర్ధారణకాగా.. కరోనాతో 18 మంది మృతిచెందినట్టు ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది.

కరోనా మృత్యు పంజా!

ఒక్కరోజే 18 మంది మృతి.. కొత్తగా 4,157 కేసులు

‘తూర్పు’లో పెరిగిన అలజడి

ఎమ్మెల్యే శ్రీదేవికి పాజిటివ్‌


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

సెకండ్‌ వేవ్‌లో కరోనా మృత్యుఘంటికలు మోగిస్తోంది.  గత 24 గంటల్లో 4,157 మందికి పాజిటివ్‌గా నిర్ధారణకాగా.. కరోనాతో 18 మంది మృతిచెందినట్టు ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. రాష్ట్రంలో సెకండ్‌వేవ్‌ మొదలైన తర్వాత ఒక్కరోజులోనే 18 మరణా లు నమోదవడం ఇదే తొలిసారి.


నెల్లూరులో అత్యధికంగా నలుగురు చనిపోగా.. చిత్తూరు, కృష్ణాలో ముగ్గురేసి చొప్పున, విశాఖపట్నంలో ఇద్దరు, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీం తో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 7,339కి పెరిగిం ది. ఇక.. తాజాగా నమోదైన 4,157 కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 9,37,049కి చేరింది. తూ ర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 617 కేసులు బయపటడగా.. శ్రీకాకుళంలో 522, చిత్తూరులో 517, గుం టూరులో 434, విశాఖపట్నంలో 417, కర్నూలులో 386, అనంతపురంలో 297, నెల్లూరులో 276, ప్రకాశం లో 230 మందికి వైరస్‌ సోకింది. బుధవారం 1,606 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.


కరోనాతో అధ్యాపకుడి మృతి

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైఎన్‌ కళాశాలలో హిందీ అధ్యాపకుడు కుమార నాగేశ్వరరావు (52) కరోనాతో మృతిచెందారు. విజయవాడలో వారం రోజులుగా కరోనాకు చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు.


సచివాలయంలో మరో మూడు కేసులు 

సచివాలయంలో మరో 3 కరోనా కేసులు బయటపడ్డాయి. ఇప్పటికే మున్సిపల్‌, పరిశ్రమలు, మైనింగ్‌ శాఖల్లోని 9 మంది ఉద్యోగులు కరోనా బారినపడగా.. తాజాగా మున్సిపల్‌ శాఖలో మరో ఇద్దరు ఎస్‌వోలు, ఒక డీఈవోకు కరోనా సోకినట్టు తెలిసింది. దీంతో ఆ శాఖ ఉద్యోగులకు అధికారులు సోమవారం వరకు అప్రకటిత సెలవు ప్రకటించినట్లు  సమాచారం.


టెస్టులు పెంచాలి.. గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ

కరోనాతో దేశం మొత్తం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని మోదీ అన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధ్యక్షతన అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లుతో బుధవారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఆర్టీపీసీఆర్‌ టెస్టులు పెంచాలని, కరోనా పాజిటిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉండేలా చూడాలని, వ్యాక్సినేషన్‌ను ముమ్మ రం చేయాలని కోరారు.


ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 11.11 కోట్ల మంది వ్యాక్సిన్‌ వేయించుకన్నారని వెల్లడించారు. రెడ్‌క్రాస్‌ వలంటీర్లు, మాజీ సైనికులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎ్‌సఎస్‌, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల సహకారంతో కొవిడ్‌పై అవగాహన కల్పించేందుకు కృషిచేయాలని గవర్నర్లను కోరారు. 50 శాతం మంది మాస్క్‌లు ధరించకపోవడం దురదృష్టకరమని వెంకయ్య అన్నారు.


Updated Date - 2021-04-15T09:39:48+05:30 IST