ప్రధానిగా ప్రమాణ స్వీకారానికి విముఖత. కారణమిదే..!

ABN , First Publish Date - 2021-07-14T00:56:41+05:30 IST

ప్రధానిగా ప్రమాణ స్వీకారానికి విముఖత. కారణమిదే..!

ప్రధానిగా ప్రమాణ స్వీకారానికి విముఖత. కారణమిదే..!

కాట్మండూ: నేపాల్ ప్రధానమంత్రిగా నియామకమైన నేపాలీ కాంగ్రెస్ అధినేత షేర్ బహదూర్ దూబా ప్రమాణ స్వీకారానికి ససేమిరా అంటున్నారు. తనకు అందించిన అపాయింట్‌మెంట్ లేఖలో రాజ్యాంగ నిబంధనను చేర్చలేదని, అది చేర్చేంత వరకు తాను ప్రమాణ స్వీకారం చేయనని మంగళవారం ఆయన తేల్చి చెప్పారు. వాస్తవానికి ఆయన ఈరోజు సాయంత్రం 6 గంటలకే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే పై కారణంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయనని ప్రకటించడం గమనార్హం. షేర్ బహదూర్‌ దూబాని ప్రధానమంత్రిగా నేపాల్ అధ్యక్షుడు బైధ్య దేవీ భండారీ నియమించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 76(5) ప్రకారం దూబాని ప్రధానిగా నియమించినట్లు అధ్యక్ష భవనం విడుదల చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు.

Updated Date - 2021-07-14T00:56:41+05:30 IST