అమ్మవారి గుడి పక్కన ఉన్న చెట్టు దగ్గరి నుంచి వస్తున్న చిన్నారి ఏడుపులు.. ఏమైందోనని వెళ్తే.. అక్కడ ఉన్నది చూసి భక్తులందరూ షాక్..!

ABN , First Publish Date - 2021-10-13T12:34:49+05:30 IST

ఆడపిల్లలు అమ్మవారి ప్రతిరూపం అంటారు. అలాంటిది అమ్మవారిని ప్రత్యేకించి పూజించే దసరా రోజుల్లో ఒక కన్నతల్లి అప్పుడే పుట్టిన తన పాపను ఒక గుడిలో వదిలి వెళ్లిపోయింది. ఈ సంఘటన హరియానాలోని ఝాజర్ నగరంలో జరిగింది.

అమ్మవారి గుడి పక్కన ఉన్న చెట్టు దగ్గరి నుంచి వస్తున్న చిన్నారి ఏడుపులు.. ఏమైందోనని వెళ్తే.. అక్కడ ఉన్నది చూసి భక్తులందరూ షాక్..!

ఆడపిల్లలు అమ్మవారి ప్రతిరూపం అంటారు. అలాంటిది అమ్మవారిని ప్రత్యేకించి పూజించే దసరా రోజుల్లో ఒక కన్నతల్లి అప్పుడే పుట్టిన తన పాపను ఒక గుడిలో వదిలి వెళ్లిపోయింది. ఈ సంఘటన హరియానాలోని ఝాజర్ నగరంలో జరిగింది. 


ఝాజర్ నగరంలోని అహరీ గ్రామంలో ఒక గుడి ఉంది. అక్కడ నవరాత్రి(దసరా నవరాత్రులు) ఉత్సవాలు జరుగుతున్నాయి. గుడిలో పూజల కోసం చాలా భక్తులు వస్తూ ఉంటారు. ఒక రోజు ఉడయం అలా వచ్చిన భక్తులకి దెగ్గర్లో ఒక చిన్నారి ఏడుస్తున్నట్లు వినిపించింది. ఆ అరుపులు చాలాసేపు నుంచి వినిపిస్తుండడంతో భక్తులలో కొంతమంది చూద్దామని వెళ్లారు. వారు ఆ చిన్నారి ఏడ్పుని గమనిస్తూ వెళ్లగా, గుడి వెనుక భాగంలో ఒక పెద్ద వట వృక్షం ఉంది. ఆ చెట్టు కొమ్మలపై ఒక వస్త్రంలో చుట్టి ఉన్న పసిపాప కనిపించింది. 


ఆ పసికందు ఆకలితో ఏడుస్తున్నట్లు ఆ భక్తులు గమనించారు. అందుకని వారు ముందుగా ఆ పసిపాప నోట్లో గంగాజలం వేశారు. ఆ వెంటనే పాప ఏడవడం ఆపింది. ఆ తరువాత పాపను తీసుకెళ్లి పాలు పట్టించారు. ఆ పాప ఎవరిదని చుట్టు పక్కల వారందరినీ అడిగారు. కానీ ఎవరూ సమాధానం చెప్పలేదు. చివరికి ఆ పాపను గుడి పూజారికి అప్పగించారు. గుడిలో ఒక పసిపాపను ఎవరో వదిలేసి వెళ్లారంటూ పోలీసులకు ఆ పూజారి సమాచారమిచ్చారు. 


గుడిలో రాత్రి అమ్మవారి పూజా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు.. ఎవరూ చూడకుండా చీకట్లో ఎవరో ఆ పసిపాపను అక్కడ వదిలివెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ పాపను పోలీసులు ఆధీనంలోకి తీసుకొని డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. పాప ఆరోగ్యంగానే ఉందని, రెండు రోజుల క్రితమే పుట్టిందని ఆస్పత్రిలో తెలిసింది. పాప తల్లి కోసం పోలీసులు చుట్టు పక్కల గ్రామలలో వెతుకుతున్నారు. గత రెండు రోజులలో ఎవరైనా ప్రసవించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


ప్రస్తుతం పాపను ఒక పిల్లల కేర్ ఆస్పత్రిలో అప్పగించారు. అక్కడ స్టాఫ్ నర్సు పాప బాగోగులు చూసుకుంటోంది. పోలీసులు ఒక గుర్తు తెలియని వ్యక్తిపై సెక్షన్ 317 ఆధారంగా కేసు నమోదు చేశారు. ఏదేమైనా నవరాత్రి పూజలు జరుగుతున్న సమయంలో ఇలా ఒక పసికందుని వదిలేసి వెళ్లడం మంచిది కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2021-10-13T12:34:49+05:30 IST