Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెళ్లికి వెళ్లొచ్చిన తర్వాత నవ దంపతుల నుంచి వచ్చిన మెసేజ్‌ను చూసి కంగుతిన్న అతిథి.. నెటిజన్ల నుంచి ఘాటు రియాక్షన్స్..!

ఇంటర్నెట్ డెస్క్: అప్పటి వరకూ పెళ్లిలో హుషారుగా గడిపి.. వారంతా ఇంటికి చేరుకున్నారు. పెళ్లిలో జరిగిన హడావిడీకి తాలుకూ జ్జాపకాలు ఇంకా వాళ్ల కళ్లలోనే మెదులుతున్నాయి. పెళ్లి భోజనాలకు సంబంధించిన ఘుమఘుమలు వాళ్లను వెంటాడుతూనే ఉన్నాయి. పెళ్లికి వెళ్లొచ్చి గంటలు కూడా గడవకముందే.. నవదంపతుల నుంచి ఆ అతిథులకు ఓ వాట్సప్ మెసేజ్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేసి.. చదివి ఆ గెస్ట్‌లు ఒక్కసారిగా షాకయ్యారు. ప్రస్తుతం ఆ మెసేజ్‌కు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారగా.. నూతన దంపతులు చేసిన పని ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకూ ఏం జరిగిందంటే..


ఓ వ్యక్తికి, యువతికి పెళ్లి కుదిరింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి బంధంతో తాజాగా వారిద్దరూ ఒక్కటయ్యారు. అంగరంగ వైభవంగా జరిగిన ఆ వివాహానికి అతిథులు బాగానే హాజరై.. వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. అనంతరం ఇంటికి చేరుకున్నారు. వాళ్లు ఇలా ఇంటికి వెళ్లారో లేదో.. ఆ నవదంపతుల నుంచి వాట్సప్‌కు ఓ మెసేజ్ వచ్చింది. అందులో ఓ వీడియోను ఉండటాన్ని గమనించిన అతిథిలు విషయం ఏంటని దంపతులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆ గెస్ట్‌లకు షాకింగ్ విషయం చెప్పారు.


‘వివాహం అనంతరం సీసీటీవీ దృశ్యాలను పరిశీలించాం. వెడ్డింగ్ కేకును ఒక పీసు తినాల్సింది పోయి మీరు రెండు పీసులు తిన్నారు. అందువల్ల 3.66 పౌండ్లు (సుమారు. రూ.366) చెల్లించాల్సి ఉంటుంది’ అంటూ మెసేజ్ పంపారు. దీన్ని చూసి ఆ అతిథుల మైండ్ బ్లాక్ అయింది. ఈ క్రమంలో ఓ అతిథి ఆ మెసేజ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు స్పందిస్తూ ‘ఒక ముక్క అదనంగా తిన్నందుకు డబ్బులు చెల్లించమనడం ఏంట్రా బాబూ’ అంటూ కామెంట్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement