తనిఖీకి వచ్చిన కొత్త డీసీపీ.. మహిళా కానిస్టేబుల్‌కు ఊహించని షాక్!

ABN , First Publish Date - 2021-01-15T01:17:43+05:30 IST

కొత్తగా విధుల్లో చేరిన కొత్త డీసీపీని గుర్తించనుందుకు ఓ కానిస్టేబుల్‌కు భారీ షాక్ తగిలింది. ఇందుకు శిక్షగా ఆమె ట్రాఫిక్ విభాగానికి బదిలీ అయినట్టు తెలిసింది.

తనిఖీకి వచ్చిన కొత్త డీసీపీ.. మహిళా కానిస్టేబుల్‌కు ఊహించని షాక్!

కొచ్చి: కొత్తగా విధుల్లో చేరిన కొత్త డీసీపీని గుర్తించనందుకు ఓ మహిళా కానిస్టేబుల్‌కు భారీ షాక్ తగిలింది. ఇందుకు శిక్షగా ఆమె ట్రాఫిక్ విభాగానికి బదిలీ అయినట్టు తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఐశ్వర్యా డొంగ్రే అనే ఐపీఎస్ అధికారి ఇటీవలే కొచ్చి నగరానికి డీసీపీగా విధుల్లో చేరారు. విధుల్లో భాగంగా ఆమె ఆదివారం నాడు టౌన్ నార్త్ మహిళా పోలీస్ స్టేషన్‌కు తనఖీ కోసం వెళ్లారు.  ఆ సమయంలో సెంట్రీ విధుల్లో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ కొత్త డీసీపీని గుర్తుపట్టలేకపోయారు. ఆమెను గేటు వద్దే ఆపి..స్టేషన్‌కు రావడానికి కారణమేమిటని ప్రశ్నించారు. ఆ సమయంలో డీసీపీ సాధారణ దుస్తులు ధరించారని, మాస్కు పెట్టుకున్నారని సమాచారం. అయితే..ఈ పరిణామం పట్ల డీసీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే సదరు కానిస్టేబుల్‌లు ట్రాఫిక్ పోలీస్ విభాగానికి బదిలీ అయ్యారని సమాచారం. 


‘ఆమె సెంట్రీ డ్యూటీలో ఉన్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. అధికారిక వాహనంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చినా కూడా ఆమె నన్ను గుర్తుపట్టలేకపోయింది’ అని ఐశ్వర్య మీడియాతో తెలిపారు. అయితే..ఈ పరిణామం పట్ల పోలీస్ వర్గాల్లో మాత్రం అసంతృప్తి వ్యక్తమవుతోంది. బదిలీకి బదులు హెచ్చరికతో సరిపెట్టి ఉంటే బాగుండేదనే అభిప్రాయం పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఉన్నతాధికారులు మఫ్టీలో ఉన్నప్పటికీ వారిని కింది స్థాయి సిబ్బంది గుర్తుపట్టాలని, అయితే మాస్క్ ధరించిన కారణంగా కొన్ని సందర్భాల్లో తెలిసిన వారిని కూడా గుర్తించలేని పరిస్థితులు నెలకొన్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. 


Updated Date - 2021-01-15T01:17:43+05:30 IST