పెళ్లయిన రెండు నెలల తర్వాత పుట్టింటికి వచ్చిన 19 ఏళ్ల యువతి.. ప్రియుడిని కలిసి పక్కా ప్లాన్.. ఇద్దరూ కలిసి చేసిన పనికి..

ABN , First Publish Date - 2021-11-23T13:37:33+05:30 IST

బీహార్‌లోని ఔరంగాబాద్‌లో ఒక ప్రేమ జంట రైలుకు..

పెళ్లయిన రెండు నెలల తర్వాత పుట్టింటికి వచ్చిన 19 ఏళ్ల యువతి.. ప్రియుడిని కలిసి పక్కా ప్లాన్.. ఇద్దరూ కలిసి చేసిన పనికి..

బీహార్‌లోని ఔరంగాబాద్‌లో ఒక ప్రేమ జంట రైలుకు ఎదురు వెళ్లి తమ ప్రాణాలు తీసుకుంది. వీరి ప్రేమ విఫలం కావడంతోనే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ యువతికి ఆమె ఇంటిలోనివారు వేరే యువకునితో వివాహం చేశారు. ఈ ఘటన నబీనగర్ పరిధిలోని ఎన్టీపీసీ ఖైరా పోలీస్‌స్టేషన్ సమీపంలో గల సలాయా రైల్వే క్రాసింగ్ వద్ద చోటుచేసుకుంది. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం ఉర్దాన్ గ్రామానికి చెందిన ఈ యువతి, యువకుడు రెండేళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే ఇద్దరివీ వేర్వేలు కులాలు కావడంతో కుటుంబ పెద్దలు వీరి వివాహానికి నిరాకరించారు. 


ఈ నేపధ్యంలోనే ఆ యువతికి ఆమె ఇంటిలోనివారు వేరే యువకునితో వివాహం జరిపించారు. అయినప్పటికీ ఆమె తన ప్రియునితో ప్రేమ కలాపాలు కొనసాగిస్తోంది. పెళ్లయిన రెండు నెలల తరువాత పుట్టింటికి వచ్చిన ఆ యువతి తిరిగి ప్రియుడిని కలుసుకుంది. ఈ నేపధ్యంలోనే వారు ఇక జీవితంలో కలిసివుండే అవకాశం లేదని భావించి, కలసి ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.  అనుకున్న విధంగానే రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ప్రేమికుల జంటను రాజు(19), రిమా కుమారి(19)గా పోలీసులు గుర్తించారు. రాజు.. గ్రామంలో ట్యూషన్ సెంటర్ నడుపుతున్నాడు. అతనికి గ్రామానికి చెందిన రీమాతో పరిచయం ఏర్పడి, అది ప్రేమకు దారితీసింది. రెండేళ్ల పాటు వీరిద్దరూ ఎవరికంటా పడకుండా ప్రేమించుకుంటూ వచ్చారు. వీరి వివాహానికి పెద్ధలు అంగీకరించలేదు. పైగా ఆ యువతి ఇంటిలోనివారు తమ అమ్మాయిని కలుసుకోవద్దని రాజును బెదిరించడంతో పాటు ఆ యువతికి వివాహం జరిపించారు. రెండు నెలల తరువాత గ్రామానికి వచ్చిన ఆ యువతి తన ప్రియుడిని కలుసుకుంది. దీంతో వారిద్దరూ ఇక తాము కలిసి జీవించలేమని, అందుకే కలసి చనిపోవాలని నిర్ణయించుకుని ఆత్మహత్య చేసుకునివుంటారని తెలుస్తోంది. ఈ ఉదంతంపై ఎస్పీ కాంతేష్ కుమార్ మాట్లాడుతూ.. రైలు పట్టాలపై లభ్యమైన ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించామని తెలిపారు. వీరిది హత్యో లేక ఆత్మహత్యో తెలియాల్సివుందని అన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక దీనిపై స్పష్టత వస్తుందన్నారు.

Updated Date - 2021-11-23T13:37:33+05:30 IST