వంద క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2020-08-02T10:03:48+05:30 IST

వంద క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

వంద క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ఖమ్మం రూరల్‌, ఆగస్టు 1: అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్న సంఘటన ఖమ్మం రూరల్‌ మండలంలో శనివారం చోటుచేసుకుంది. రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ వెంకట్రావు, సీఐ వెంకటస్వామి, రూరల్‌ సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్‌ఐ రాములు మండల పరిధిలోని ములకలపల్లి క్రాస్‌ రోడ్‌ లో  మాటు వేశారు. వాహన తనిఖీలు చేస్తుండగా మహబూబాబాద్‌ వైపు నుంచి అనుమానాస్పదంగా ఓ లారీ వస్తుండగా లారీనీ ఆపి తనిఖీ చేశారు. అందులో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టుబడ్డాయి. లారీని అదుపులోకి తీసుకుని డ్రైవర్‌ను విచారించగా మహబూబాబాద్‌ జిల్లా ఆలేరు నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని యానాంకు వందక్వింటాల  రేషన్‌ బియ్యాన్ని  రవాణా చేస్తున్నట్లు తెలిసింది. ఈ బియ్యం విలువ రూ.2లక్షల70 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఖమ్మం నగరంలోని ప్రకాష్‌నగర్‌ ప్రాంతానికి చెందిన లారీడ్రైవర్‌, ఓనర్‌ అయిన కందిమల్ల శ్రీనివాస్‌, క్లీనర్‌ గోపాల్‌ను అరెస్ట్‌ చేసి లారీని సీజ్‌ చేశారు. వారిపై కేసునమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-08-02T10:03:48+05:30 IST