కరోనా బాధితుల పట్ల వివక్ష చూపొద్దు

ABN , First Publish Date - 2020-08-02T10:32:49+05:30 IST

కరోనా బాధితుల పట్ల వివక్ష చూపొద్దు

కరోనా బాధితుల పట్ల వివక్ష చూపొద్దు

సిద్దిపేట టౌన్‌, ఆగస్టు 1: కరోనా సోకిన బాధితుల పట్ల వివక్ష చూపొద్దని మంత్రి హరీశ్‌రావు సూచించారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని ఓ గార్డెన్‌లో 286 మంది లబ్ధిదారులకు రూ.2.86 కోట్ల కల్యాణలక్ష్మి, షాదిముబారక్‌ చెక్కులను జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజారాధాకృష్ణశర్మతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కరోనా బాధితుల పట్ల సమాజంలో రావాల్సిన మార్పులను వివరించారు. కొవిడ్‌ బాధితుల పట్ల సమాజ స్పందన సరిగ్గా లేదని, మానవత్వం మంట కలిసేలా కొందరి వ్యవహార శైలి ఉన్నదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా చెక్కులు తీసుకున్న అక్కా, చెల్లెళ్లు తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ సాయిరాం, ఆర్డీవో అనంతరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-08-02T10:32:49+05:30 IST