Abn logo
Aug 2 2020 @ 05:20AM

మిల్లర్ల పాపం!

సహకార సిబ్బందికి శాపం 

ధాన్యం డబ్బులు తక్కువ రావడంపై నిలదీస్తున్న రైతులు 

 

ఆర్మూర్‌/మెండోర, ఆగస్టు 1: రైస్‌మిల్లర్లు చేసిన పాపం సహకార సిబ్బందికి శాపంగా తయారైంది. యాసంగి ధాన్యానికి సంబంధించి డబ్బులు తక్కువ రావడంతో రైతులు స్థానికంగా ఉండే సొసైటీ సిబ్బందిని నిలదీస్తున్నారు. తాము షిట్‌ సరిగా పంపామని, డబ్బులు ఎందుకు తక్కువ వచ్చాయో తెలియదని అంటున్నారు. తక్కువ డబ్బు లు రావడంపై సావెల్‌ సొసైటీ వద్ద శనివారం కూడా రైతులు ధర్నా చేశారు. బక్రీద్‌ పండగ సందర్భంగా సెలవు అయినప్పటికీ సొసైటీ సిబ్బంది కార్యాలయానికి రావాల్సి వచ్చింది. జిల్లాకేంద్రం సహకార బ్యాంకు డైరెక్టర్‌ నాగంపేట్‌ శేఖర్‌ వచ్చి రైతులను సముదాయించారు. సొసైటీ సిబ్బంది అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని, రైస్‌మిల్లర్లు తక్కువ ఇస్తే రైతులకు న్యాయం జరిగేలా ప్రయత్ని స్తామని హామీ ఇచ్చారు. మిగతా సొసైటీలో కూడా రైతులు వచ్చి తమకు డబ్బులు తక్కువగా వచ్చాయని వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో సహకార సిబ్బంది తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఈసారి ప్రభుత్వం ప్రతీ గింజను కొనుగోలు చేసింది. రైతులకు ఇబ్బంది కలు గకుండా చర్యలు తీసుకుంది. 


గతంలో కన్నా ఎక్కువ కేంద్రాలు..

జిల్లాలో గతంలో కన్నా ఎక్కువగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ మిల్లర్ల వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. కడ్తా తీసుకోవద్దని ప్రభు త్వం హెచ్చరించినప్పటికీ రైస్‌మిల్లర్లు బేఖాతరు చేశారు. ఒకరకంగా రైస్‌మిల్లర్లే శాసించారు. తాము తప్ప వేరే వారు తీసుకునే వారు లేర నే ఉద్దేశంతో సిండికేటుగా మారి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అధి కారులు సైతం వారికే వత్తాసు పలికేలా మచ్చిక చేసుకున్నారు. ట్రా క్కు షిట్‌ను కాదని రైస్‌మిల్లర్ల షీట్‌ను ఓకే చేశారంటే అధికారులు ఎం త వత్తాసు పలికారో అర్థమవుతుంది.


ఇష్టారాజ్యంగా కడ్తా..

రైతుల బలహీనతను ఆసరా చేసుకొని మిల్లర్లు మాయాజాలం చేశారు. కొనుగోలు కేంద్రం నుంచి లారీ వచ్చిన తర్వాత తర్ర ఎక్కువ గా వచ్చిందంటూ దించుకోకుండా తిరస్కరించారు. మిల్లర్లు దించుకో కుంటే లారీ వెనక్కి వెళ్లాలి. లేదా గంజిలోకి వెళ్లాలి. గంజిలో మద్దతు ధర రాదు. వెనక్కి వెళ్తే రూ.30వేల నష్టం జరుగుతుంది. గత్యంతరం లేక దించుకోమంటే ఇష్టారాజ్యంగా కడ్తా తీసుకున్నారు. వానాకాలం పండిన ధాన్యాన్ని అన్ని రైస్‌మిల్లర్లకు కేటాయిస్తారు. యాసంగిలో పం డిన ధాన్యాన్ని కేవలం బైల్డ్‌ రైస్‌మిల్లులకే కేటాయిస్తారు. బైల్డ్‌ రైస్‌ మిల్లులు తక్కువగా ఉన్నాయి. దీంతో వారు ధాన్యం కొనుగోలును పా టిస్తున్నారు.

Advertisement
Advertisement