‘ మాస్క్‌లు ధరించాలా.. వద్దా..?’

ABN , First Publish Date - 2020-04-07T19:25:25+05:30 IST

కరోనా వైరస్ ప్రబలుతున్న సమయంలో అసలు మాస్క్‌లు ధరించాలా..? వద్దా..?...

‘ మాస్క్‌లు ధరించాలా.. వద్దా..?’

అమరావతి : కరోనా వైరస్ ప్రబలుతున్న సమయంలో అసలు మాస్క్‌లు ధరించాలా..? వద్దా..? అనే విషయమై అనేక రకాలైన సందేహాలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కోవిడ్-19 టీమ్‌ను ఏర్పాటు చేసింది. కరోనా నేపథ్యంలో ఎలాంటి సమస్యలున్నా సరే నివృతి చేయడానికి నిపుణులు, డాక్టర్లను నియమించింది. ఈ మేరకు కోవిడ్ టీమ్‌లో ఒకరైన డాక్టర్ అర్జా శ్రీకాంత్ మాట్లాడుతూ.. గత వారం రోజులుగా ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా సందేహాలను నివృత్తి చేయడానికి టీమ్ ప్రయత్నం చేస్తోందన్నారు. 


మన ఇంట్లోనే చేసుకోవచ్చు..

మాస్క్‌లు ఇంట్లోనే చేసుకునే విధానం.. ఎప్పుడు ధరించాలి..? అనే విషయాలను ప్రభుత్వం వారు జారీ చేసినటువంటి మార్గదర్శకాలు పొందుపరుస్తున్నాము. ఎవరి మీదా ఆధారపడకుండా మన మాస్క్‌ను మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మన తోటివారికి ఇవ్వవచ్చు కూడా. ఎలాంటి ఆరోగ్యపరమైన అనుమానం ఉన్నా.. మరీ ముఖ్యంగా జలుబు, గొంతునొప్పి, జ్వరము నీరసంగా అనిపిస్తే వెంటనే 104కి ఫోన్ చేయండి.. మా వైద్య సిబ్బంది స్పందించి తగు సహాయం చేస్తారు. ఇంటి పనంతా ఒంటరిగా చేస్తున్న గృహలక్ష్మికి  చేదోడుగా ఉండండి. సురక్షితంగా ఉండండి!!అని అర్జా శ్రీకాంత్ తెలిపారు.

Updated Date - 2020-04-07T19:25:25+05:30 IST