ఇవి తాగితే కరోనా రాదని చిత్తూరులో ప్రచారం.. తీరా చూస్తే..!

ABN , First Publish Date - 2020-04-07T19:54:31+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు ఇంతవరకూ ఎక్కడా మెడిసిన్ కనుక్కోలేదు.

ఇవి తాగితే కరోనా రాదని చిత్తూరులో ప్రచారం.. తీరా చూస్తే..!

చిత్తూరు : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు ఇంతవరకూ ఎక్కడా మెడిసిన్ కనుక్కోలేదు. అయితే దీన్నే అదనుగా చేసుకున్న కొందరు ఇదిగో ఇవి తింటే కరోనా రాదని తెగ ప్రచారం చేసేస్తున్నారు. ఇంకొదరైతే ఇదిగో ఇదే కరోనా మెడిసిన్ అంటూ హడావుడీ చేస్తున్నారు.


అయితే తాజాగా.. చిత్తూరు జిల్లాలో కొత్త ప్రచారం జరుగుతోంది. నాటుసారా తాగితే కరోనా రాదని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా రూ.25 నాటుసారాను రూ.వెయ్యికి మాఫియా అమ్మేస్తోంది. కార్వేటినగరం నుంచి తిరుపతికి భారీగా నకిలీ సారా తరలించారు. ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు స్పందిస్తూ.. కల్తీసారా తాగితే కరోనా రాకపోయినా చనిపోతారని చెబుతున్నారు. 


ఇదొక ప్రచారం..

ఇదిలా ఉంటే.. చిత్తూరు బైరెడ్డిపల్లి మండలంలోని ఎ.కొత్తూరులో కొత్త ప్రచారం జరిగింది. ఉమ్మెత్తకాయల ద్రావణం తాగితే కరోనా రాదని పుకార్లు రావడంతో జనాలు తెగ తాగేశారు. తీరా చూస్తే.. ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. వారందర్నీ పలమనేరు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే ఇలాంటి పుకార్లు ఏవీ నమ్మొద్దని పోలీసులు, అధికారులు పదే పదే చెబుతున్నారు.

Updated Date - 2020-04-07T19:54:31+05:30 IST