Advertisement
Advertisement
Abn logo
Advertisement

అత్తారింట్లో అడుగు పెడుతూనే అలిగిన కొత్త కోడలు... నిచ్చెన సాయంతో ఇంటిపైకి ఎక్కి...

పెళ్లయిన తరువాత కొత్త కొడలు అత్తవారింటికి వచ్చినప్పుడు అత్తామామలు, మరుదులు, ఆడపడుచులు ఆమెకు ఘనంగా స్వాగతం పలుకుతుంటారు. ఇంతేకాదు ఇరుగుపొరుగువారిని పిలిచి ఘనంగా వేడుక చేస్తారు. ఈ విధంగా జరగకపోతే కొత్తకోడలు నిరాశకు గురవుతుంది. తాజాగా ఇటువంటి ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అత్తవారింటికి చేరిన కొత్త కోడలు అక్కడ తనకు ఘన స్వాగతం లభించకపోవడంతో ఆగ్రహంతో చిందులు తొక్కింది. 

అత్తామామలు ఆమె కోపాన్ని చల్లార్చేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆమె ఏమాత్రం తగ్గలేదు. పైగా అక్కడే ఉన్న ఒక నిచ్చెన తీసుకుని, దాని సాయంతో ఇంటిపైకి ఎక్కేసింది. అక్కడే ఉన్న పెళ్లికొడుకు నచ్చజెప్పినప్పటికీ ఆమె ఏమాత్రం వినలేదు. ఆమెను కిందకు దిగాలని కోరుతూ వారు ఎంతగా ప్రాధేయపడినప్పటికీ ఆమె మొండితనంతో ఇంటిపై నుంచి కిందకు దిగలేదు. నిరంజన్ మహాపాత్ర తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement