Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోస్కోతో అదానీ గ్రూప్‌ జట్టు

గుజరాత్‌లో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు.. 36,950 కోట్ల పెట్టుబడి


న్యూఢిల్లీ: గుజరాత్‌కు చెందిన అదానీ గ్రూప్‌ తాజాగా ఉక్కు విభాగంలోకి అడుగుపెడుతోంది. ఇందులో భాగంగానే గుజరాత్‌లో మరిన్ని పెట్టుబడులకు సిద్దమైంది. దక్షిణ కొరియాకు చెందిన ‘పోస్కో’తో కలిసి సమగ్ర స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రెండు కంపెనీల మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ ప్లాంట్‌ కోసం రెండు కంపెనీలు 500 కోట్ల డాలర్లు (దాదాపు రూ.36,950 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నాయి. గుజరాత్‌లోని ముంద్రా వద్ద ఈ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నారు. 

Advertisement
Advertisement