Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరంగల్‌కు మైండ్‌ట్రీ

క్యూ3లో కంపెనీ లాభం రూ.437 కోట్లు 


న్యూఢిల్లీ: దేశీయ ఐటీ కంపెనీ మైండ్‌ట్రీ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరణపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా వరంగల్‌, కోయంబత్తూర్‌లో కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా మైండ్‌ట్రీ సీఈఓ, ఎండీ దెబాశిష్‌ చటర్జీ తెలిపారు. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి కంపెనీ లాభం వార్షిక ప్రాతిపదికన 34 శాతం వృద్ధి చెంది రూ.437.5 కోట్లకు చేరుకుంది. ఆదాయం 36 శాతం పెరిగి రూ.2,750 కోట్లుగా నమోదైంది. గడిచిన మూడు నెలల్లో 4,500 మందికి పైగా కంపెనీలో చేర్చుకున్నట్లు, దాంతో డిసెంబరు 31 నాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 31,959కి చేరిందని కంపెనీ వెల్లడించింది. మున్ముందు త్రైమాసికాల్లో ప్రాంగణ నియామకాలను మరింత పెంచనున్నట్లు తెలిపింది. 

Advertisement
Advertisement