రాణించిన కేన్‌, లాథమ్‌

ABN , First Publish Date - 2020-12-04T09:15:48+05:30 IST

వెస్టిండీస్‌తో తొలి టెస్టులో ఆతిథ్య న్యూజి లాండ్‌ భారీ స్కోరు దిశగా సాగుతోంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం మొదలైన తొలి మ్యాచ్‌లో ఆట ముగిసేసరికి కివీస్‌ 2 వికెట్ల నష్టానికి 243 పరుగులు సాధించింది...

రాణించిన  కేన్‌, లాథమ్‌

హామిల్టన్‌: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో ఆతిథ్య న్యూజి లాండ్‌ భారీ స్కోరు దిశగా సాగుతోంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం మొదలైన తొలి మ్యాచ్‌లో ఆట ముగిసేసరికి కివీస్‌ 2 వికెట్ల నష్టానికి 243 పరుగులు సాధించింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (97 బ్యాటింగ్‌), ఓపెనర్‌ లాథమ్‌ (86) అర్ధ సెంచరీలతో రాణించారు. కీమర్‌ రోచ్‌ (1/53), గాబ్రియెల్‌ (1/62) చెరో వికెట్‌ తీశారు. ప్రస్తుతం విలియమ్సన్‌తో పాటు రాస్‌ టేలర్‌ (31) క్రీజులో ఉన్నాడు. అరంగేట్ర ఓపెనర్‌ విల్‌ యంగ్‌ (5) సింగిల్‌ డిజి ట్‌కే పెవిలియన్‌ చేరాడు. ఈ దశలో లాథమ్‌-కేన్‌ రెండో వికెట్‌కు 154 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను చక్కది ద్దారు. ఇక, మ్యాచ్‌ ప్రారంభానికి ముందు మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్లు మోకాళ్లపై కూర్చొని జాతి వివక్ష (బ్లాక్‌ లైవ్‌ మ్యాటర్‌) ఉద్యమానికి మద్దతు తెలిపారు.

Updated Date - 2020-12-04T09:15:48+05:30 IST