వచ్చే ఏడాది... ఆభరణాలకు డిమాండ్, లాభాలు: ఎందుకంటే...

ABN , First Publish Date - 2021-03-19T23:05:54+05:30 IST

బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టం నుండి రూ.11 వేలకు పైగా తగ్గడంతో ఆభరణాల డిమాండ్‌లో వృద్ధి కొనసాగుతోందని ఇండియా రేటింగ్స్ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో... 2022 లో రిటైల్ జ్యువెలరీ డిమాండ్ 30 శాతం నుండి 35 శాతం పెరగవచ్చునని పేర్కొంది.

వచ్చే ఏడాది... ఆభరణాలకు డిమాండ్, లాభాలు: ఎందుకంటే...

న్యూఢిల్లీ : బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టం నుండి రూ.11 వేలకు పైగా తగ్గడంతో ఆభరణాల డిమాండ్‌లో వృద్ధి కొనసాగుతోందని ఇండియా రేటింగ్స్ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో... 2022 లో రిటైల్ జ్యువెలరీ డిమాండ్ 30 శాతం నుండి 35 శాతం పెరగవచ్చునని పేర్కొంది. ఆర్థిక: బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టం నుండి రూ.11 వేలకు పైగా తగ్గడంతో ఆభరణాల డిమాండ్‌లో వృద్ధి కొనసాగుతోందని ఇండియా రేటింగ్స్ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో... 2022 లో రిటైల్ జ్యువెలరీ డిమాండ్ 30 శాతం నుండి 35 శాతం పెరగవచ్చునని పేర్కొంది. ఆర్థిక కార్యకలాపాలు కొవిడ్ ముందుస్థాయికి చేరడం దోహదపడుతోందని పేర్కొంది. పండుగ సీజన్‌కు తోడు వివాహాది శుభకార్యాలు, గరిష్ఠస్థాయి నుండి బంగారం ధరలు తగ్గడంతో గత అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ఆభరణాల డిమాండ్ పుంజుకుందని అభిప్రాయపడింది.


ప్రతికూలం నుండి స్థిరం... 

ఆభరణాల రంగం రేటింగ్‌ను స్థిరత్వం-ప్రతికూలం నుండి స్థిరత్వానికి సవరించింది. కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపధ్యంలో డిమాండ్ గణనీయంగా పడిపోవడం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే వచ్చే ఏడాది డిమాండ్ బలంగా పుంజుకుంటుందని పేర్కొంది. పసిడి ధరలు మరింత తగ్గుతుండటం కలిసి వస్తుందని వెల్లడించింది. అయితే 2019-20 తో పోలిస్తే మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరం డిమాండ్ వృద్ధి 5-10 శాతంగా ఉండవచ్చునని పేర్కొంది.


అందుకే కలిసి రావొచ్చు...

పెద్ద సంఖ్యలో జెవెలరీ కంపెనీలు కొత్త ప్రారంభోత్సవాలను వాయిదా వేసుకున్నాయి. 

Updated Date - 2021-03-19T23:05:54+05:30 IST