బాటిలింగ్ ప్లాంట్లపై ఎన్‌జీటీ రూ. 25 కోట్లకు పైగా జరిమానా...

ABN , First Publish Date - 2022-03-07T23:49:11+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని కోకాకోలా, పెప్సీలను బాటిల్‌ చేసిన రెండు ప్లాంట్లపై ఎన్‌జీటీ(నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) జరిమానా విధించింది.

బాటిలింగ్ ప్లాంట్లపై ఎన్‌జీటీ రూ. 25 కోట్లకు పైగా జరిమానా...

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని కోకాకోలా, పెప్సీలను బాటిల్‌ చేసిన రెండు ప్లాంట్లపై ఎన్‌జీటీ(నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) జరిమానా విధించింది. భూగర్భ జలాలను అతిగా వినియోగించుకున్నందుకుగాగాను రూ. 25 కోట్లకు పైగా జరిమానా విధించింది. మూన్ బెవరేజెస్ లిమిటెడ్ డ్రింకింగ్ వాటర్ ప్యాకేజింగ్ కోసం ప్లాస్టిక్ బాటిళ్లను కూడా తయారు చేస్తోంది కాగా... యూనిట్ ఎక్స్‌టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ సర్టిఫికేషన్ కోసం నమోదు చేసుకోకపోవడంతోపాటు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నియమాలను ఉల్లంఘించింది. 


మూన్ బెవరేజెస్ లిమిటెడ్ డ్రింకింగ్ వాటర్ ప్యాకేజింగ్ కోసం ప్లాస్టిక్ బాటిళ్లను కూడా తయారు చేస్తోంది. భూగర్భజలాల పరిస్థితి ఇప్పటికే ఆందోళనకరంగా ఉందని ఎన్‌జీటీ పేర్కొంది. గ్రేటర్ నోయిడాలో ఉన్న మూన్ బెవరేజెస్ లిమిటెడ్‌కు రూ. 1.85 కోట్లు, మూన్ బెవరేజ్ లిమిటెడ్‌కు చెందిన సాహిబాబాద్ యూనిట్‌పై రూ. 13.24 కోట్లు, వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్‌పై రూ. 9.71 కోట్లను పర్యావరణ పరిహారాన్ని విధించింది. మూన్ బెవరేజెస్ లిమిటెడ్, వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్‌లపై సుశీల్ భట్ దాఖలు చేసిన ఫిర్యాదుపై ధర్మాసనం విచారణ చేపట్టింది. 

Updated Date - 2022-03-07T23:49:11+05:30 IST