కేసీఆర్ సర్కార్, GHMC, రాంకీ సంస్థకు NGT నోటీసులు

ABN , First Publish Date - 2021-09-09T17:55:29+05:30 IST

జవహర్ నగర్‌ డంపింగ్ యార్డు కాలుష్యంపై ఎన్‌జీటీ విచారణ నిర్వహించింది. డంపింగ్ యార్డును అక్కడ నుంచి తరలించాలని స్థానికులు పిటిషన్ దాఖలు చేశారు.

కేసీఆర్ సర్కార్, GHMC, రాంకీ సంస్థకు NGT నోటీసులు

హైదరాబాద్ : జవహర్ నగర్‌ డంపింగ్ యార్డు కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) విచారణ నిర్వహించింది. డంపింగ్ యార్డును అక్కడ నుంచి తరలించాలని స్థానికులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ఎన్‌జీటీ.. తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, రాంకీ సంస్థకు నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 4కల్లా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కాలుష్యంపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డుకు ఎన్‌జీటీ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది.

Updated Date - 2021-09-09T17:55:29+05:30 IST