ఎన్‌హెచ్‌ఏఐ ఫైళ్ల వివరాలు ఇంటర్నెట్‌లో

ABN , First Publish Date - 2020-07-05T07:49:15+05:30 IST

భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) మెయిల్‌ సర్వర్‌పై మేజ్‌ రాన్సమ్‌వేర్‌ దాడి చేసిన కొన్ని రోజులకే దొంగిలించిన ఫైళ్లలోని కొన్ని వివరాలు ఇంటర్నెట్‌లో....

ఎన్‌హెచ్‌ఏఐ ఫైళ్ల వివరాలు ఇంటర్నెట్‌లో

5 శాతం డేటానే లీక్‌ చేశామన్న రాన్సమ్‌వేర్‌ ఆపరేటర్లు

దర్యాప్తు జరుపుతున్న సెర్ట్‌ ఇన్‌

 

న్యూఢిల్లీ, జూలై 4: భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) మెయిల్‌ సర్వర్‌పై మేజ్‌ రాన్సమ్‌వేర్‌ దాడి చేసిన కొన్ని రోజులకే దొంగిలించిన ఫైళ్లలోని కొన్ని వివరాలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. సైబర్‌ దాడి సందర్భంగా డేటాను కాపీ చేయడమేకాకుండా ఎన్‌క్రిప్ట్‌ చేసిన మొత్తం డేటాలో కేవలం 5 శాతం ఫైళ్లను మాత్రమే లీక్‌ చేసినట్టు రాన్సమ్‌వేర్‌ ఆపరేటర్లు ప్రకటించారు. ఎన్‌హెచ్‌ఏఐ మాజీ చైర్మన్‌, ఒక మాజీ సీనియర్‌ అధికారికి సంబంధించిన సమాచారాన్ని సైబర్‌ దాడికి పాల్పడిన నేరగాళ్లు లీక్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సెర్ట్‌ ఇన్‌) నిపుణులు ఎన్‌హెచ్‌ఏఐ కార్యాలయాన్ని సందర్శించి దర్యాప్తును చేపట్టారు. 

Updated Date - 2020-07-05T07:49:15+05:30 IST