ఇద్దరు ఐసిస్ మద్దతుదారుల అరెస్ట్ : ఎన్ఐఏ

ABN , First Publish Date - 2021-08-17T20:58:28+05:30 IST

ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) సిద్ధాంతాలను సామాజిక మాధ్యమాల్లో

ఇద్దరు ఐసిస్ మద్దతుదారుల అరెస్ట్ : ఎన్ఐఏ

కొజిక్కోడ్ : ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) సిద్ధాంతాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తెలిపింది. ఈ భావజాలాన్ని ప్రచారం చేస్తున్న బృందంలో వీరిద్దరూ సభ్యులని, వీరిని కన్నూరులో అరెస్టు చేశామని తెలిపింది. 


షిఫా హారిస్, మిఝా సిద్ధిఖ్‌లను కన్నూరులోని ఠానాలో ఉన్న వారి ఇళ్ళ వద్ద అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ మంగళవారం పేర్కొంది. వీరు ఐసిస్ భావజాలాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారని తెలిపింది. మలపురంవాసి ముహమ్మద్ అమీన్ వురపు అబు యాహ్యాను 2015 మార్చిలో అరెస్టు చేయడంతో ఈ ఇద్దరు మహిళల గురించి తెలిసిందని పేర్కొంది. 2015 మార్చిలో జమ్మూ-కశ్మీరులో మరో ముగ్గుర్ని అరెస్టు చేసినట్లు తెలిపింది. 


కర్ణాటకలోని భట్కల్‌కు చెందిన జుఫ్రి జవహర్ దామూదీ, మంగళూరుకు చెందిన అమ్మర్ అబ్దుల్ రహమాన్, బెంగళూరుకు చెందిన శంకర్ వెంకటేశ్ పెరుమాళ్‌లను ఆగస్టు 6న అరెస్టు చేసినట్లు తెలిపింది. వీరంతా టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, హూప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఐసిస్ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లలోని ఐసిస్ హ్యాండ్లర్స్‌తో దామూదీకి నేరుగా సంబంధాలు ఉన్నట్లు పేర్కొంది. ఐసిస్ హ్యాండ్లర్స్ ఇచ్చిన ప్రచారాంశాలను అనువాదం చేసి, భారత దేశంలో సర్క్యులేట్ అవుతున్న వాయిస్ ఆఫ్ హింద్, స్వాత్ అల్ హింద్ అనే పత్రికల్లో ప్రచారం చేస్తున్నారని తెలిపింది. 


Updated Date - 2021-08-17T20:58:28+05:30 IST